Mahesh Babu New Look: 'సర్కారు వారి పాట' సినిమా తర్వాత పూర్తిగా ఫ్యామిలీకి ఎక్కువ సమయాన్ని కేటాయించారు హీరో మహేశ్ బాబు. కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లి వచ్చారు. లండన్, యూరప్‌తో పాటు పలు దేశాలను పర్యటించారు. ప్రస్తుతం ఈ టూర్స్ ముగించుకున్న ఆయన.. త్వరలోనే త్రివిక్రమ్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు. ఇందులో మహేశ్ లుక్ ఎలా ఉంటుందోనని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే అభిమానులకు తన కొత్త స్టిల్ ద్వారా ఓ క్లారిటీ ఇచ్చారు మహేశ్ బాబు. సోమవారం మహేశ్ షేర్ చేసిన న్యూ లుక్ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో లైట్‌గా గడ్డం, మీసంకట్టుతో స్టైలిష్‌గా మహేశ్ కనిపిస్తున్నారు. 'లవింగ్ ది న్యూ వైబ్' అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత మహేశ్ లుక్‌ను సంగీత దర్శకుడు తమన్, డైరెక్టర్ తివ్రిక్రమ్.. 'ఎస్ఎస్ఎమ్‌బీ 28' హ్యాష్ ట్యాగ్ ఇచ్చి ట్వీట్ చేశారు. దీంతో త్రివిక్రమ్ సినిమాలో మహేష్ ఈ లుక్‌లోనే కనిపించనున్నారంటూ ఓ చిన్న క్లారిటీ ఇచ్చేశారు.