Mahesh Billgates: ప్రపంచ శ్రీమంతుల్లో బిజినెస్ టైకూన్ బిల్‌గేట్స్ ఒకరు. ఆయనకు మన దేశంతో మంచి అనుబంధం ఉంది. తాజాగా ఈ ప్రపంచ శ్రీమంతుడిని మన వెండితెర శ్రీమంతుడు మహేశ్‌బాబు కలిశారు. అందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫొటో చూసిన అభిమానులు, నెటిజన్లు తెగ సంబరపడుతున్నారు.
ప్రస్తుతం మహేశ్.. ఫ్యామిలీతో కలిసి అమెరికాలో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పలు పర్యటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఫ్యామిలీతో ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే న్యూయార్క్ నగరంలో బిల్‌గేట్స్‌ను మహేశ్ కలుసుకున్నారు. ఆ ఫొటో షేర్ చేస్తూ.. "నిజంగా బిల్‌గేట్స్‌ను కలవడం చాలా ఆనందంగా ఉంది.. ఈ ప్రపంచం చూసిన గొప్ప దార్శనికుల్లో ఆయన ఒకరు. అంతేకంటే ఎంతో వినమ్రతతో ఉంటారు. నిజంగా అందరికీ ఆయనో స్ఫూర్తి!!" అని మహేశ్ బాబు తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.