విదేశాల్లో ఉన్నప్పటికీ.. తెలుగు భాష, సంస్కృతి, కళల పట్ల ప్రేమాభిమానాల్ని కొనసాగిస్తున్నారంటూ ప్రవాసాంధ్రులను సినీనటుడు జగపతిబాబు అభినందించారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. అభిమానుల ప్రేమే తనను అమెరికాకు రప్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేత మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారిని అభినందించారు. ఈ సందర్భంగా చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
మీ ప్రేమాభిమానాలే నన్ను ఇక్కడికి రప్పించాయి: జగపతిబాబు - Actor Jagapathi Babu wishes to expatriates
Actor Jagapathi Babu with expatriates in Washington: అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో నటుడు జగపతిబాబు పాల్గొన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ.. తెలుగు సంప్రదాయాలను కొనసాగిస్తున్నారంటూ అక్కడి ప్రవాసాంధ్రులను జగపతిబాబు ప్రశంసించారు.
మీ ప్రేమాభిమానాలే నన్ను ఇక్కడికి రప్పించాయి: జగపతిబాబు