తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఫ్యాన్స్​కు అందుబాటులో స్టార్​ హీరో నిజంగా వచ్చానంటూ వీడియో రిలీజ్​ - చియాన్​ విక్రమ్​ అప్టేట

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు చియాన్‌ విక్రమ్‌ ఇకపై అభిమానులకు మరింత చేరువగా ఉండనున్నారు. తన సినిమా అప్డేట్లతో పాటు ఇతర ముఖ్యమైన విషయాలను వీలైనంత ఎక్కువమంది అభిమానులకు చేర్చనున్నారు. దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు ఆయన తాజాగా నటించిన కోబ్రా సినిమాకు సంబంధించిన​ అప్డేట్​ను మేకర్స్ ప్రకటించారు.

hero chiyan vikram entered into twitter
hero chiyan vikram entered into twitter

By

Published : Aug 13, 2022, 8:12 PM IST

Hero Vikram Twitter: వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉండే హీరో విక్రమ్‌.. సోషల్‌ మీడియాను చాలా అరుదుగా ఉపయోగిస్తుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి పరిశ్రమలో ఉన్న ఆయనకు ఇప్పటివరకూ ఫేస్‌బుక్‌ ఖాతా కూడా లేదంటేనే అర్థమవుతోంది. అభిమానులందరి కోరిక మేరకు 2016 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఖాతా ప్రారంభించారు. 'the_real_chiyaan' అనే పేరుతో ఉన్న ఆ ఖాతా వేదికగా తన ఇష్టాయిష్టాలు, కొత్త సినిమా విశేషాలు, షూట్‌ లొకేషన్స్‌.. ఇలా ఎన్నో అంశాలను ఆయన పంచుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఆయన మరో సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టారు. ట్విట్టర్​లో అందుబాటులోకి వచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం రాత్రి ట్విట్టర్‌లో ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేశారు. అందులో ఆయన పొడవాటి గడ్డంతో విభిన్నమైన లుక్‌లో కనిపించారు. "నేను మీ చియాన్‌ విక్రమ్‌. నిజంగా నేనే. డూప్‌ కాదు. నా తదుపరి సినిమా కోసం ఇలా సిద్ధమవుతున్నా. చాలా ఆలస్యంగా వచ్చాను.. ఏం అనుకోకండి. కానీ ఇది సరైన సమయమనే అనుకుంటున్నా. మీరు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ఇకపై మీకు ట్విట్టర్​లోనూ అందుబాటులో ఉండనున్నా" అని విక్రమ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన చియాన్‌ అభిమానులు.. తమ అభిమాన నటుడు ట్విటర్‌లోకి వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కోబ్రా మూవీ అప్డేట్..
మరోవైపు, విక్రమ్​ న‌టించిన 'కోబ్రా' సినిమాపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్‌లు, అధీరా సాంగ్​కు మంచి రెస్పాన్స్​ వస్తోంది. ఆగ‌స్టు 30న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానున్న నేపథ్యంలో మేక‌ర్స్ వ‌రుస అప్డేట్​లను ఇస్తున్నారు.
తాజాగా ఈ చిత్రంలోని థ‌ర్డ్ సింగిల్​కు సంబంధించిన అప్డేట్​ను ప్ర‌క‌టించారు. 'తరంగిణి' అంటూ సాగే మెలోడీయ‌స్ గీతాన్ని ఆగ‌స్టు 16న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ చిత్రంలో విక్ర‌మ్ ఏడు విభిన్న గెట‌ప్స్‌లో క‌నిపించ‌నున్న‌ట్లు టాక్. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో 'కేజీఎఫ్' భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టించారు. ప్ర‌ముఖ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో కనిపించనున్నారు.

ఇవీ చదవండి:లాల్​ సింగ్​ చడ్డా సినిమాకు ఆస్కార్​ గుర్తింపు నెటిజన్లు ఫైర్​

బింబిసార మూవీ చూసిన బాలయ్య

ABOUT THE AUTHOR

...view details