'నేను నటించే ఒక్కో సినిమాలో ఓ ఎమోషన్ ఉంటుంది' అని అన్నారు చియాన్ విక్రమ్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగంసెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ ''ఇక్కడికి సినిమా అంటే ఇష్టమున్నవారందరూ వచ్చారు. నేను చేసిన వాటిలో ఒక్కొక్క సినిమాకు ఒక్కో ఎమోషన్ ఉంటుంది. నాన్న అంటే ఎమోషన్.. శివ పుత్రుడు అంటే యాక్షన్.. అపరిచితుడు అంటే పెర్ఫామెన్స్.. అలాంటిది పొన్నియిన్ సెల్వన్ సినిమాను ఒకే ఒక సీన్ కోసం నటించాను. గుర్రంపై వచ్చే సీన్‌ను మణిరత్నం చెప్పినప్పుడు ఆ ఒక్క సీన్‌లో నేను కనిపిస్తే చాలని నటించాను. అంతే కాదు.. మంచి స్టార్ క్యాస్ట్ ఉన్న టీమ్‌తో కలిసి పని చేశాను. ఈ సినిమా ఓ రికార్డ్. ఎందుకంటే ఇందులో అందరూ హీరోస్.. హీరోయిన్స్ నటించారు. పొన్నియన్ సెల్వన్‌లో ఒక్కొక్క క్యారెక్టర్‌లో ఒక్కో లేయర్ ఉంటుంది. అందుకనే అందరూ ముందుకు వచ్చారు. అందరం మణిరత్నంగారి కోసం ఈ సినిమా చేశాం. ఆయన నా డ్రీమ్ డైరెక్టర్. ఈ సినిమాలో నేను నటించటం చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన టెక్నిషియన్స్ వర్క్ చేశారు. ఏ ఆర్ రెహ్మాన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకు ధన్యవాదాలు'' అని అన్నారు.