తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'భోళా శంకర్' సెట్స్‌లో కీర్తి గొంతు పట్టుకున్న చిరు?.. మెగాస్టార్​ క్లారిటీ ఇదిగో! - భోళాశంకర్​ మూవీ సెట

Bhola Shankar Chiranjeevi Keerthy Suresh : మెగాస్టార్​ చిరంజీవి.. భోళాశంకర్​ ప్రమోషన్స్​లో ఫుల్​ బిజీగా ఉన్నారు. జాం జాం జజ్జనక సాంగ్​ మేకింగ్ వీడియోలో ఆయన.. కీర్తి సురేశ్ గొంతు ఎందుకు పట్టుకున్నారనే విషయంపై తాజాగా వివరణ ఇచ్చారు. అది ఆయన మాటల్లోనే..

Etv Bharat
Etv Bharat

By

Published : Aug 7, 2023, 5:29 PM IST

Bhola Shankar Chiranjeevi Keerthy Suresh : కొందరు హీరోలు ఎంత సీనియర్స్ అయినా కూడా తమ సహాయ నటులతో పాటు అందరితో చాలా సరదాగా ఉంటారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ఈవెంట్స్‌, ఇంటర్వ్యూల్లో కూడా చిరు చాలా సరదాగా ఉంటారు. ముఖ్యంగా ఆయన మూవీ ప్రమోషన్స్ సమయంలో మెగాస్టార్​ సందడి వేరే లెవెల్​. అయితే త్వరలోనే భోళా శంకర్ విడుదల కానున్న నేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నారు. అదే సమయంలో మేకింగ్ వీడియోలో కీర్తి సురేశ్ గొంతు ఎందుకు పట్టుకున్నారు అనే విషయంపై వివరణ ఇచ్చారు.

తాజాగా కమెడియన్​ గెటప్ శ్రీను.. భోళా శంకర్ టీమ్‌తో ఒక ఇంటర్వ్యూను హోస్ట్ చేశారు. అందులో సినీ నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు మెహర్ రమేశ్‌తో పాటు మూవీలో లీడ్ రోల్స్ చేసిన చిరంజీవి, తమన్నా, కీర్తి సురేశ్ పాల్గొన్నారు. ఇంటర్వ్యూ మొత్తం చాలా సరదాగా, చిలిపి ప్రశ్నలతో సాగింది. ముందుగా తమన్నాకు కీర్తి సురేశ్‌ను పరిచయం చేసింది తానేనని చిరు తెలిపారు. కానీ తర్వాత వారిద్దరూ ఫ్రెండ్స్ అయిపోయి తనను పక్కన పెట్టేశారని చిరు వారిని ఆటపట్టించారు.

Jam Jam Jajjanaka Song : అయితే భోళా శంకర్ సినిమాలో జాం జాం జజ్జనక అనే సెలబ్రేషన్ సాంగ్ ఉంది. అయితే ఈ సాంగ్ మేకింగ్​ వీడియోను కొన్నిరోజుల క్రితం.. చిరు లీక్స్​లో భాగంగా మెగాస్టార్​ సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. అందులో ఒక చోట చిరు.. కీర్తి సురేశ్ పీక పట్టుకున్నారు. అది సరదాగానే అనిపించినా.. అసలు అలా ఎందుకు చేశారు అని చాలామంది అభిమానులకు ఒక డౌట్ మిగిలిపోయింది. ఇక గెటప్ శ్రీనుతో జరిగిన ఇంటర్వ్యూలో చిరంజీవిని ఇదే ప్రశ్న అడిగారు. కీర్తి సురేశ్ పీక పట్టుకోవడానికి అసలు కారణం ఏంటో చిరంజీవి తెలిపారు.

"కీర్తి హైదరాబాద్‌లో నాకు ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు అనేది. అయితే అడగొచ్చు కదా ఫుడ్ పంపించేవాడిని అని అంటే అదే చూస్తున్నాను అని చెప్పింది. అప్పటినుంచి మా ఇంటి నుంచి తనకు కావాల్సినవి వచ్చేవి. మా ఇంటి నుంచి తనకు కావాల్సిన తమిళ ఫుడ్ కానీ, తెలుగు ఫుడ్ కానీ రోజూ తనకు పంపిస్తుండేవాడిని. ప్రతీరోజూ చాలా వెరైటీలు డిమాండ్ చేసేది. నా గురించి ఇది చేసి పెట్టండి అని అడగను.. కానీ తన గురించి మాత్రం చెఫ్ చాలా వెరైటీలు చేసేవాడు. అన్నీ తిని చాలా బాగుంది అని చెప్పేది. ఏదైనా తేడాగా ఉంటే అది కొంచెం తగ్గింది, ఇది కొంచెం తగ్గింది, మళ్లీ సెట్ చేసి పంపించమనండి అనేది. ఇదేమైనా హోటల్ అనుకుంటున్నావా అన్నాను. ఆ తర్వాత రేపు ఏం పంపిస్తున్నారు అని అడగగానే పీక పట్టుకున్నాను" అంటూ భోజనం గురించి తనకు, కీర్తికి మధ్య జరిగిన సరదా సంభాషణలను బయటపెట్టారు చిరు.

Upcoming Telugu Movies : మెగాస్టార్ X సూపర్​స్టార్​.. ఈ వారం కొత్త సినిమాల రిలీజ్​ లిస్ట్​ ఇదే!

'పవన్ అలిగి వెళ్లారని.. అతడికి ఫోన్ చేసి మరీ గట్టి వార్నింగ్!'.. చిరు కోపంపై డైరెక్టర్ బాబీ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్!

ABOUT THE AUTHOR

...view details