టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణ.. తనను అభిమానించే వారిని ఆయన అంతే స్థాయిలో అభిమానిస్తారు. ఫ్యాన్స్ కోసం ఎంత దూరం అయినా వెళ్లి.. ఎంతో విలువ ఇచ్చే స్టార్ హీరోల్లో బాలకృష్ణ ఒకరు. బాలయ్య.. నిర్మాతల శ్రేయస్సును ఎప్పుడూ కోరుకుంటారని ఆయనతో పని చేసిన నిర్మాతలు చాలా సందర్భాల్లో చెప్పారు. బాలయ్య మనస్సులో ఒకటి పెట్టుకుని పైకి మరోలా ఉండరని ఫ్యాన్స్ సైతం చెబుతారు. అలా నటసింహం అభిమానాన్ని చూసి ఆశ్చర్యపోయిన సంఘటన తాజాగా జరిగింది.
సాధారణంగా బాలయ్య అటు రాజకీయాలతో, ఇటు కుటుంబంతో, మరో వైపు వరుస సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆయన్ను ఏదైనా ఈవెంట్‌కు పిలిస్తే.. అంత ఖాళీ చేసుకుని రావటం ఆయనకు కష్టమే! కానీ బాలయ్య మాత్రం తను ఇష్టపడిన వారి కోసం ఎంత దూరం అయినా వెళ్తారు. రీసెంట్గా ఓ ప్రయాణంలో ప్లైట్‌లో పరిచయమై.. ఇంటి గృహాప్రవేశానికి రావాలని ప్రేమగా పిలవడంతో ఆ వ్యక్తి ఎవరు.. ఏంటి అనేది కూడా చూడకుండా బాలయ్య అతిథిగా ఆ ఇంటికి వెళ్లారు. ఆ ట్రావెల్ ఫ్రెండ్ కుటుంబానికి బోలెడంత సంతోషాన్ని అందించారు.
ఇటీవలే ఓసారి బాలయ్య విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో పక్కన కూర్చున హరీష్ వర్మ అనే వ్యక్తితో ఆయనకు పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారిందట. అప్పుడప్పుడు బాలయ్యతో ఆయన మాట్లాడడం జరుగుతుందట. ఈ నేపథ్యంలోనే ఆ స్నేహితుడు గృహ ప్రవేశ కార్యక్రమానికి బాలయ్య హాజరయ్యారు. మాటల సందర్భంలో తన గృహప్రవేశం గురించి చెప్పిన మాటలను సీరియస్‌గా తీసుకున్న బాలయ్య తన ట్రావెల్ ఫ్రెండ్‌ను సర్ప్రైజ్ చేసి సందడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి
Bhagavanth Kesari Cast : ప్రస్తుతం బాలకృష్ణ.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. సాహు గారపాటి - హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఈ సినిమా బాలయ్య మార్క్ యాక్షన్‌తో ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే చెప్పారు. అది నిజమేననే విషయంటైటిల్ ఎనౌన్స్మెంట్తోనేతేలిపోయింది. దసరాకు విడుదల కానున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. యంగ్ హీరోయిన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ.. డైరెక్టర్ బాబీతో తన 109వ సినిమా చేయనున్నారు. అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు బాలయ్య పుట్టినరోజు నాడు జరిగాయి.