తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అదిరిపోయిన 'జై బాలయ్య' సాంగ్.. బాలకృష్ణ ఫ్యాన్స్​కు వీకెండ్​లో 'ట్రిపుల్'​ ధమాకా - బాలకృష్ణ వీరసింహారెడ్డి

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్​ వచ్చేసింది. బాలయ్య హీరోగా రూపొందుతోన్న 'వీరసింహారెడ్డి' సినిమా నుంచి తొలిపాటను చిత్రబృందం రిలీజ్​ చేసింది. 'జై బాలయ్య' అంటూ సాగే ఈ పాట ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

hero balakrishna
hero balakrishna

By

Published : Nov 25, 2022, 10:32 AM IST

Balakrishna Veersimhareddy First Song Released: బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్​ రానే వచ్చింది. 'వీరసింహారెడ్డి' చిత్రం నుంచి 'జై బాలయ్య' అంటూ సాగే పాటను మేకర్స్​ శుక్రవారం రిలీజ్​ చేశారు. మ్యూజిక్​ డెరెక్టర్​ తమన్​ సంగీతం అందించిన ఈ పాట అదిరిపోయింది. మీరూ ఓ సారి ఈ పాట వినేయండి.

గోప్‌చంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న 'వీరసింహారెడ్డి' చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌‌లో శరవేగంగా జరుగుతోంది. నిర్మాతలు ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.

గోవా ఫిల్మ్ ఫెస్టివల్​లో అఖండ సందడి..
Goa Film Festival Akhanda: గోవాలో 53వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టాలీవుడ్​ అగ్ర కథానాయకుడు నటించిన 'అఖండ' సినిమాకు అరుదైన గౌరవం లభించింది. గురువారం రాత్రి అఖండ చిత్రం ప్రదర్శితమైంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటికి ఆహ్వానాలు అందడంతో వారిద్దరు పాల్గొన్నారు.

గోవా ఫిల్మ్ ఫెస్టివల్​లో బాలయ్య సందడి

అనంతరం బాలయ్య మాట్లాడారు. "మేము ఎప్పుడూ ట్రెండ్​ ఫాలో అవ్వం.. కొత్త ట్రెండ్​ను​ సృష్టిస్తాం" అంటూ బాలకృష్ణ అన్న మాటలకు ఆ ప్రాంగణమంతా చప్పట్లతో దద్దరిల్లింది. కొవిడ్​ మహమ్మారి సమయంలో డేరింగ్​ స్టెప్​ వేసి అఖండ సినిమాను థియేటర్లలో విడుదల చేసినందుకు నిర్మాత మిర్యాల రవీందర్​ రెడ్డికి మరోసారి ధన్యావాదాలు తెలిపారు బాలయ్య.

అన్​స్టాపబుల్ కొత్త ఎపిసోడ్​ స్ట్రీమింగ్​..
Unstoppable New Episode:బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్‌స్టాపబుల్‌ - 2' కొత్త ఎపిసోడ్​ ఆహా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోన్న ఈ సెలబ్రిటీ టాక్‌షో నాలుగో ఎపిసోడ్‌కు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, సినీ నటి రాధిక, రాజ్యసభ ఎంపీ సురేశ్‌ విచ్చేశారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ ఎపిసోడ్​.. 'బాలయ్య కుటుంబాన్ని చూసిన మీకు.. ఇవాళ బాలయ్య స్నేహాన్ని పరిచయం చేయాలనిపించింది' అంటూ నటసింహం నందమూరి బాలకృష్ణ తన కాలేజీ రోజుల్ని గుర్తుచేసుకున్నారు. మొత్తానికి బాలయ్య తన మిత్రులతో చేసిన రచ్చ మామూలుగా చేయలేదు.

సీజన్ 2 మొదటి ఎపిసోడ్​కు​ గెస్ట్​లు​గా మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయడు, ఆయన కుమారుడు లోకేశ్​ వచ్చారు. గంటపాటు నవ్వుల వర్షం కురిపించారు. రెండో ఎపిసోడ్​ అదే రేంజ్​లో ఉండేందుకు.. మాస్​కా దాస్​ విశ్వక్​ సేన్​, 'డీజే టిల్లు'తో అలరించిన సిద్ధు జొన్నలగడ్డ వచ్చారు. ఇందులో ఇద్దరు యువ కథానాయకులతో.. బాలయ్య అల్లరి మామూలుగా లేదు. మూడో ఎపిసోడ్​కు మళ్లీ యువనటులు శర్వానంద్​, అడవి శేష్​ వచ్చారు. వీళ్ల రాకతో మూడో ఎపిసోడ్​లోనూ ప్రేక్షకులకు అన్​స్టాపబుల్​ ఫన్​ అందింది.

ABOUT THE AUTHOR

...view details