'లైగర్' డిజాస్టర్‌తో దర్శకుడు పూరి జగన్నాథ్‌తో సినిమా చేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. పూరి పని ఇక అయిపోయిందని అంటున్నారు. అయితే ఆయనకు గతంలోనూ ఎన్నో డిజాస్టర్లు వచ్చాయి. కానీ ఆ ప్రభావం ఎప్పుడూ ఆయనపై పెద్దగా పడలేదు. వెంటనే ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఓ మంచి కథతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి కాస్త మారినట్లు కనిపిస్తోంది. అంతకుముందులా స్టార్ హీరోలు, నిర్మాతలు ఆయన కోసం లైన్లో ఉన్నట్లు కనిపించడం లేదు. ఏదేమైనప్పటికీ పూరి.. నెక్స్ట్స్ ఎలాంటి సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తారనేది? ఏ హీరోతో సినిమా చేస్తారనేది? మాత్రం సినీ ప్రియుల్లో ఆసక్తిగానే ఉంది. అయితే ఆయన ప్రస్తుతం ఓ మంచి కథను రాసే పనిలో ఉన్నారని అంటున్నారు. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బాస్టర్ ఇవ్వడంతో.. ఆ కృతజ్ఞతతో మళ్లీ పూరితో సినిమా చేసేందుకు రామ్ పోతినేని ముందుకొచ్చారని రీసెంట్గా వార్తలు కూడా వచ్చాయి.
ఈ సినిమా గురించి త్వరలో అధికారిక ప్రకటన కూడా రాబోతుందని అన్నారు. కానీ ఇప్పుడు రూట్ మారింది. మరో ఇంట్రెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. అందరూ అనుకుంటున్నట్లుగా పూరి తన తర్వాతి సినిమాను రామ్‌తో చేయట్లేదని మళ్లీ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నారని అంటున్నారు. కానీ రామ్ పోతినేనితో సినిమా క్యాన్సిల్ అవ్వలేదట. అంతకన్నా ముందు బాలయ్యతో సినిమా చేసేందుకు పూరి రెడి అయ్యారని తాజాగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.