తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఇంట‌ర్నేష‌న‌ల్ DJతో 'ఊ అంటావా' సాంగ్‌కు బ‌న్నీ స్టెప్పులు.. క్రేజ్​ అంటే ఇదేనేమో! - allu arjun vdieo

వ‌ర‌ల్డ్ టాప్ డీజేల్లో ఒక‌రైన మార్టిన్ గారిక్స్‌తో క‌లిసి పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ పాట‌కు ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ డ్యాన్స్ చేశారు. ఆ సంగతులు..

allu arjun martin garrix
allu arjun martin garrix

By

Published : Mar 5, 2023, 1:31 PM IST

Updated : Mar 5, 2023, 2:31 PM IST

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​. విదేశాల్లోనూ బన్నీ విపరీతమైన క్రేజ్​ను సొంతం చేసుకున్నారు. అయితే పుష్ప‌ సినిమాలోని అల్లు అర్జున్​ మేన‌రిజ‌మ్స్‌ను ప‌లువురు ఫారిన్ సెల‌బ్రిటీలు కాపీ చేసిన వీడియోలు, ఫొటోలు ఆ మధ్య కాలంలో సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్‌గా మారాయి. అంతే కాకుండా పుష్ప‌లో అల్లు అర్జున్​ నటనకు ఫిదా అయ్యి ఎంతోమంది విదేశీయులు.. అభిమానులుగా కూడా మారిపోయారు.

తాజాగా ఆయన ఫ్యాన్స్ జాబితాలోకి వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ డీజే మార్టిన్ గారిక్స్‌ చేరారు! శ‌నివారం హైద‌రాబాద్‌లో మార్టిన్ గారిక్స్‌ మ్యూజిక్ కాన్సెర్ట్ జ‌రిగింది. ఈ మ్యూజిక్ కాన్సెర్ట్‌లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. గారిక్స్‌తో క‌లిసి స్టేజ్‌పై పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ పాట‌కు అల్లు అర్జున్ డ్యాన్స్ చేశారు. అల్లు అర్జున్‌తో క‌లిసి పుష్ప సినిమా పాట‌కు డ్యాన్స్ చేసిన వీడియోను గారిక్స్ ఇన్​స్టా స్టోరీలో షేర్​ చేశారు. అది కాస్త వైరల్​గా మారింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ గారిక్స్ పోస్ట్ చేసిన వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. బన్నీ క్రేజ్​ అంటే ఇదీ అని కామెంట్లు పెడుతున్నారు.

అల్లు అర్జున్​, మార్టిన్​ గారిక్స్​
అల్లు అర్జున్​, మార్టిన్​ గారిక్స్​

గారిక్స్​ ఎవరు?
నెద‌ర్లాండ్స్‌కు చెందిన మార్టిన్ గారిక్స్ వ‌ర‌ల్డ్ టాప్ 100 డీజేల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్నారు. యానిమ‌ల్స్‌, ఇన్ ద నేమ్ ఆఫ్ ల‌వ్​తో పాటు ఆయన స్వ‌ర‌ప‌ర‌చిన ఎన్నో ఆల్బమ్స్ మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆక‌ట్టుకున్నాయి.

శరవేగంగా షూట్​..
సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో 2021లో రిలీజైన పుష్ప సినిమా పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో పెద్ద విజ‌యాన్ని సాధించింది. నాలుగు వంద‌ల కోట్ల‌ రూపాయలకకు పైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం పుష్ప ది రూల్ పేరుతో ఈ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. హైద‌రాబాద్‌లో సీక్వెల్ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సీక్వెల్‌లోనూ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టిస్తున్నారు. వీరితో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Last Updated : Mar 5, 2023, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details