తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హాలీవుడ్‌ రేంజ్‌లో అఖిల్‌ 'ఏజెంట్‌' టీజర్‌ - ఏజెంట్

అఖిల్‌ హీరోగా తెరకెక్కిన సినిమా 'ఏజెంట్‌'. ఈ మూవీ టీజర్​ను శుక్రవారం విడుదలైంది. హాలీవుడ్​ రేంజ్​లో.. ఉన్న టీజర్​ అభిమానులను ఆకట్టుకుంటోంది.

hero akhil agent movie teaser release
హాలీవుడ్‌ రేంజ్‌లో అఖిల్‌ 'ఏజెంట్‌' టీజర్‌

By

Published : Jul 15, 2022, 5:30 PM IST

అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా సురేందర్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఏజెంట్‌'. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని షురూ చేసింది. ఇందులో భాగంగా ప్రముఖ నటులు కిచ్చా సుదీప్‌, శివకార్తికేయన్‌లతో టీజర్‌ను విడుదల చేయించింది. వినూత్నమైన స్పై థ్రిల్లర్‌ కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్టు టీజర్‌లో చూపించిన యాక్షన్‌ ఘట్టాలను చూస్తే తెలుస్తోంది. అఖిల్‌ ఆహార్యం, పలికిన సంభాషణలు ఆయన అభిమానుల్లో జోష్‌ నింపేలా ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details