Nayanthara first look in Godfather : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'గాడ్ ఫాదర్' మూవీలో నటిస్తున్న హీరోయిన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తున్నారని ఊహగానాలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ చిత్ర బృందం పోస్టర్ రిలీజ్ చేసింది.'సత్య ప్రియ జయదేవ్' అనే పాత్రలో ఆమె నటించనున్నారని తెలిపింది. పోస్టర్లో సంప్రదాయబద్దమైన కాటన్ చీరలో నయన్ కనిపించారు. టైప్ రైటర్‌పై ఏదో రాస్తునట్లుగా ఉన్న ఆ పోస్టర్‌ను చూసిన అభిమానులు ఈ పాత్రకు నయన్ కరెక్ట్ ఛాయిస్ అని కామెంట్లు పెడుతున్నారు.
లేడీ సూపర్‌స్టార్‌గా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సుపరిచితురాలైన నయన్.. తాజాగా దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత ఆమె నటించనున్న ప్రాజెక్టుల్లో గాడ్ ఫాదర్ ఒకటి కావడం విశేషం. ఈ మాస్ ఎంటటైనర్ మూవీలో కండల వీరుడు సల్మాన్ గెస్ ట్రోల్‌లో అలరించనున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. మరో కీలక విషయమేమిటంటే ఈ సినిమాలో దర్శకుడు పూరీ జగన్నాథ్, నటుడు సత్యదేవ్ సైతం నటిస్తున్నారు. మెగాస్టార్ సతీమణి కొణిదెల సురేఖ ఈ చిత్ర నిర్మాతగా వ్యవహరించగా, మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నారు.