తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'RC 15' షూటింగ్ ఫొటోస్ షేర్ చేసిన కియారా!.. మీరూ చూసేయండి!! - ఆర్​సీ 15 కియార్​ ఇన్స్టాగ్రామ్

రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న పాన్ ఇండియ‌న్ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం న్యూజిలాండ్‌లో జ‌రుగుతోంది. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో చ‌ర‌ణ్‌తో క‌లిసి బ‌ర్గ‌ర్ తింటున్న ఫొటోల‌ను కియారా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

Etv Bharat
Etv Bharat

By

Published : Nov 25, 2022, 2:18 PM IST

RC15 On Location Photos Viral: 'RC 15' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు రామ్‌చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్‌లో జ‌రుగుతోంది. నాయ‌కానాయిక‌ల‌పై ఓ రొమాంటిక్ డ్యూయెట్‌ను తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు శంక‌ర్‌. బుధ‌వారం నుంచి డ్యూన్‌డీన్‌సిటీ బీచ్‌తో పాటు స‌ముద్ర తీర ప్రాంతాల్లోని బ్యూటీఫుల్ లొకేష‌న్స్‌లో ఈ పాట‌ను చిత్రీక‌రిస్తున్నారు. షూటింగ్ గ్యాప్‌లో టీమ్ మెంబ‌ర్స్‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డుపుతున్న ఫొటోల‌ను కియారా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. మొద‌టి ఫొటోలో చ‌ర‌ణ్‌తో క‌లిసి బ‌ర్గ‌ర్ లాగిస్తూ కియారా క‌నిపిస్తోంది.

కియారా షేర్​ చేసిన ఫొటో

మ‌రో ఫొటోలో టీమ్ అంతా క‌నిపించారు. ఇందులో రామ్‌చ‌ర‌ణ్‌, కియారాతో పాటు డ్యాన్స్ మాస్ట‌ర్ బాస్కో మార్టీస్‌, అలీమ్ హ‌కీమ్ త‌దిత‌రులు ఉన్నారు. కియారా షేర్ చేసిన ఈ ఫొటోలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ ఫొటోల‌ను ఉద్దేశిస్తూ బ‌ర్గ‌ర్స్ విత్ దేస్ బ‌గ్గ‌ర్స్ అంటూ ట్వీట్ చేసింది. కొన్ని కారణాల వల్ల త‌న పోస్ట్ నుంచి ఆ ప‌దాల‌ను తొల‌గించింది. తర్వాత సాంగ్ షూట్ కోసం డైట్‌లో ఉన్నామంటూ పేర్కొనంది. కియారా పోస్ట్ చేసిన ఫొటోల‌ను ఉద్దేశించి రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న స్పందించింది. అంద‌రిని మిస్ అవుతున్న‌ట్లుగా పేర్కొంది.

కియారా షేర్​ చేసిన ఫొటో

పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా శంక‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. పాన్ ఇండియ‌న్ స్థాయిలో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ హిందీ భాష‌ల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. న‌వీన్‌చంద్ర‌, సునీల్‌, అంజ‌లి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details