Oscars nominations 2023: సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్ నామినేషన్స్ చిత్రాల జాబితా వచ్చేసింది. 95వ ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన చిత్రాలను ది అకాడమీ ప్రకటించింది. భారతీయుల ఆశలకు ఊతం ఇస్తూ, 'ఆర్‌ఆర్‌ఆర్'లో 'నాటు నాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయింది. వివిధ భాషల నుంచి దాదాపు 300 చిత్రాలు షార్ట్‌లిస్ట్ కాగా, అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ మెంబర్స్ తుది జాబితాకు ఎంపిక చేశారు. రిజ్ అహ్మద్, అల్లిసన్ విలియమ్స్ వ్యాఖ్యాతలుగా కాలిఫోర్నియా వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. 'లగాన్' తర్వాత మరో భారతీయ చిత్రం ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడం గమనార్హం.
ఒరిజినల్ సాంగ్
- నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్)
- అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్)
- హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్)
- లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్)
- ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సహాయ నటుడు
- బ్రెన్డాన్ గ్లెసన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
- బ్రైయిన్ టైరీ హెన్రీ (కాజ్‌వే)
- జడ్ హిర్చ్ (ది ఫేబుల్‌మ్యాన్స్)
- బేరీ కియోఘాన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
- కి హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)