Hebah Patel The Great Indian Suicide : రామ్ కార్తిక్, హెబ్బాపటేల్ కీలక పాత్రల్లో నటించిన మిస్టరీ థ్రిల్లర్ 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్'. విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబరు 6వ తేదీన రిలీజ్ కానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఆహా ట్వీట్ కూడా చేసింది. ప్రచార చిత్రం చూస్తుంటే, సినిమా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ అని అర్థమవుతోంది. పోస్టర్లో తలలేని హెబ్బా పటేల్‌ను చూపించి కాస్త భయపెట్టించారు. కళ్లను కప్పేసిన మూఢనమ్మకం.. నమ్మకంతో రాసుకున్న మరణశాసనం అని రాసుకొచ్చారు. ఈ సినిమా కల్ట్ క్లాసిక్ సూసైడ్ స్టోరీ అని చెప్పారు.
ఈ సినిమా నేపథ్యం ఏంటంటే?.. మదనపల్లి పట్టణంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' తెరకెక్కించారు. ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. అసలు సూసైడ్ చేసుకోవడానికి వెనక వాళ్ల ఉద్దేశం ఏంటి? మళ్లీ పుట్టడమేనా? అసలేందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎమోషనల్ డ్రామా, మనసును తాకే థ్రిల్స్, అనూహ్యమైన రొమాన్స్... సినిమాలో అన్నీ ఉండేలా తీర్చిదిద్దారు. చిత్రంలో హెబ్బా పటేల్‌తో పాటు నటులు నరేష్ వీకే, పవిత్రా లోకేష్ కూడా భార్య భర్తలుగా కనిపించనున్నారు.