బాలీవుడ్ కండలవీడురు సల్మాన్ ఖాన్ భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం 'నో ఎంట్రీ' సినిమాకు సీక్వెల్.. 'నో ఎంట్రీ మే ఎంట్రీ' మూవీని పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ఈ సినిమాను భారీ తారాగణంతో రూపొందించనున్నారట. అనీజ్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ కూడా నటిస్తున్నారు.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 'నో ఎంట్రీ మే ఎంట్రీ' మూవీలో 10 మంది టాప్ హీరోయిన్లు నటించనున్నారట. అందులో సమంత, రష్మిక మందన్న, పూజా హెగ్డే, తమన్నా భాటియా లాంటి స్టార్ హీరోయిన్ల పేర్లు దాదాపు ఖారారైనట్టు సమాచారం. ఆ పది మంది కూడా దక్షిణాది సినిమాల్లో టాప్ హీరోయిన్లు కావడం గమనార్హం.