NTR Prashanth Neel movie : 'ఆర్ఆర్ఆర్' బిగ్గెస్ట్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్ భారీ స్థాయిలో ఉంది. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. దీని తర్వాత ఆయన 'కేజీయఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్తో(NTR 31 movie) ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. దీనిపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో తారక్ సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు గానీ సోషల్మీడియాలో మాత్రం ఈ పేరు చక్కర్లు కొడుతోంది. అంతకముందు దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్ పేర్లు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు ప్రియాంక దాదాపుగా కన్ఫామ్ అయినట్టు అంటున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మించనున్నాయి.
బాలీవుడ్ అరంగేట్రం..
NTR bollywood movie : ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వనున్నారు. ఇప్పటికే సినిమా కూడా ఖరారు అయిపోయింది. స్టార్ హీరో హృతిక్ రోషన్ నటిస్తోన్న 'వార్ 2' చిత్రంలో ఆయన కీలక పాత్రలో కనిపించనున్నారు. నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని హృతిక్ కన్ఫామ్ చేశారు. దీనికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారు.