ustaad bhagat singh Shooting : పవన్ కల్యాణ్.. ఓ వైపు పాలిటిక్స్.. మరోవైపు మూవీస్ అంటూ రెండు పడవల మీద కాలు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా పరిస్థితి అస్సలు కనిపించట్లేదు. ఏపీలో ఎన్నికల దగ్గరపడుతుండం వల్ల ప్రస్తుతం పవన్ ఫోకస్ మొత్తం ప్రచార సభలు, పర్యటనల మీదే ఉన్నాయి. దీంతో ఆయన నటించే సినిమాల షూటింగ్‌లు ఇప్పటిలో పూర్తయ్యేట్టు లేవు.
పవన్ నటిస్తున్న సినిమాల్లో 'ఉస్తాద్ భగత్ సింగ్' సింగ్ కూడా ఒకటి. ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడినట్టు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పుడా ప్రచారం మరింత ఊపందుకుంది. షూటింగ్‌ను ప్రస్తుతానికి పూర్తిగా ఆపేశారని తెలిసింది. ఎన్నికలు అయిపోయిన తర్వాతే మళ్లీ మొదలు పెడతారట. అయితే పవన్ కోసం హరీశ్ శంకర్ గత మూడేళ్ళుగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇతర ఏ సినిమాలకు కూడా కమిట్ అవ్వకుండా పవన్ డేట్స్ కోసమే ఎదురుచూశారు. కానీ ఇప్పుడు మాత్రం ఆగే పరిస్థితి అస్సలు లేదు. ఎందుకంటే పవన్.. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఖాళీగా ఉండరని అర్థమైందట. దీంతో హరీశ్ కూడా తన ఉస్తాద్ ప్రాజెక్ట్‌ను ఎలక్షన్స్ పూర్తయ్యేవరకు పక్కనపెట్టి.. కొత్త సినిమాను తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారట. మాస్ మహారాజా రవితేజ ఓ సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పుడీ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.
Harish shankar Raviteja movies: గతంలో బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన 'రైడ్' చిత్రాన్ని రీమేక్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రవితేజకు 'ధమాకా' వంటి భారీ బ్లాక్ బాస్టర్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే ఈ సినిమాను కూడా నిర్మించనుందట. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ ప్రస్తుతం దీని గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.