Hari Hara Veeramallu Fire Accident : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా 'హరిహర వీరమల్లు'. ఈ చిత్రం షూటింగ్లో భాగంగా దుండిగల్ పరిధిలోని బౌరంపేట్‌లో ఓ భారీ సెట్ వేశారు. ఆదివారం అర్ధరాత్రి సెట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అప్రమత్తమైన చిత్రబృందం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టమేని జరగలేదని చిత్ర యూనిట్ తెలిపింది. కానీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ బిజీ షెడ్యుల్ వల్ల ఈ సినిమా షూటింగ్ కాస్త నెమ్మదించింది. ఈ సినిమాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఇటీవలే పవన్ కల్యాణ్ పచ్చజెండా ఊపారట. మళ్లీ త్వరలోనే షూటింగ్ ప్రారంభమవ్వాల్సి ఉండగా.. ఈ ప్రమాదం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Hari Hara Veeramallu Shooting Update : సినిమాలో ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం ఒక భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ మధ్య కురిసిన వర్షాల కారణంగా ఆ సెట్ కాస్త తీవ్రంగా దెబ్బతింది. అలా ధ్వంసమైన సెట్‌ను రిపేర్ చేసి మళ్లీ షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది. తిరిగి ఆ సెట్‌ను మరమ్మతు చేసే క్రమంలో వెల్డింగ్ పనులు జరుగుతుండగా.. అక్కడే ఉన్న థర్మాకోల్‌కు నిప్పు రవ్వలు తగలడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని సమాచారం. అలా ఒకే సెట్ రెండు సార్లు దెబ్బతినటంతో భారీగా అస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది.