తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

పవన్ కెరీర్​లోనే బిగ్గెస్ట్ హిట్​గా హరిహర వీరమల్లు, రిలీజ్ డేట్ ఇదే - hari hara veera mallu director

పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా విడుదల తేదీపై కీలక ప్రకటన చేశారు ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం. పవర్​స్టార్ కెరీర్​లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్​బస్టర్​గా నిలిచిపోతుందని ధీమాగా చెప్పారు.

Hari Hara Veera Mallu release date
Hari Hara Veera Mallu release date

By

Published : Aug 21, 2022, 5:04 PM IST

Hari Hara Veera Mallu release date: హరిహర వీరమల్లు సినిమా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్​లోనే బిగ్గెస్ట్ హిట్​గా నిలిచిపోతుందని ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం పేర్కొన్నారు. పీరియాడిక్ చిత్రం కావడం వల్లే ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోందని తెలిపారు. 2023 మార్చి 30న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ వేస్తున్నామని రత్నం వివరించారు. భారీ బడ్జెట్​తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Hari Hara Veera Mallu budget:
'హరిహర వీరమల్లు బిగ్ బడ్జెట్ చిత్రం. ఇది పీరియాడిక్ చిత్రం వల్ల కాస్త ఆలస్యమవుతోంది. పాన్ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నాం. 2023 మార్చి 30 విడుదల చేయాలని అనుకుంటున్నాం. రిలీజ్ అయితే అతిపెద్ద హిట్ అవుతుంది. పవన్ కల్యాణ్ సినీ కెరీర్​లోనే బిగ్గెస్ట్ హిట్​గా నిలిచిపోతుంది' అని రత్నం వివరించారు.

Hari Hara Veera Mallu story: 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో హరిహర వీరమల్లు చిత్రం రూపొందుతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకొంటోంది. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో బాలీవుడ్ స్టార్స్ నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ కనిపించబోతున్నారు. మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ కూడా నటించనున్నట్లు సమాచారం.

Pawan Kalyan news: ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ పాత్ర యోధుడిలా రాబిన్‌హుడ్‌ను పోలి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇందులో పవన్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. మూడు పాత్రల్లోనూ 'హరి హర వీరమల్లు' పాత్రదే స్పెషల్‌ అట్రాక్షన్‌ అంటున్నారు. ఈ సినిమాలో పవన్‌ పాత్రలను దృష్టిలో పెట్టుకుని 30 రకాల విభిన్న దుస్తులు సిద్ధం చేసిందట చిత్ర బృందం. ప్రతి డ్రెస్‌ దేనికదే ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుందట. మరి పవన్‌కల్యాణ్‌ ఎలా కనిపిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమా కోసం పవన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను గతంలో చిత్ర బృందం పంచుకుంది. ఇక తెరపై 'వీరమల్లు'గా పవన్‌ విజృంభణ చూసేందుకు అభిమానులు ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details