తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Har Ghar Tiranga Song: ప్రభాస్​, కోహ్లీల 'హర్ ఘర్ తిరంగా' సాంగ్.. మనసంతా త్రివర్ణమే! - హర్​ ఘర్​ తిరంగా సాంగ్​ వీడియా

Har Ghar Tiranga Song: కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ బుధవారం 'హర్ ఘర్ తిరంగ' దేశభక్తి గీతాన్ని విడుదల చేసింది. ఇందులో బాలీవుడ్​ స్టార్​ అమితాబ్​ బచ్చన్​, టాలీవుడ్​ హీరో ప్రభాస్‌తోపాటు హీరోయిన్ కీర్తి సురేష్, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ విరాట్ కోహ్లీ తదితరులు నటించారు. ప్రస్తుతం నెట్టింట వైరల్​ అవుతోన్న ఈ వీడియో సాంగ్​ను మీరూ ఓ సారి చూసేయండి.

hari ghar tiranga video song released by central government
hari ghar tiranga video song released by central government

By

Published : Aug 4, 2022, 10:08 AM IST

Har Ghar Tiranga Song: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ బుధవారం 'హర్ ఘర్ తిరంగ' పాటను రిలీజ్ చేసింది. ఇందులో బాలీవుడ్​ స్టార్​ అమితాబ్​ బచ్చన్​, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తోపాటు భారత క్రికెట్​ జట్టు మాజీ సారథి విరాట్ కొహ్లీ కనువిందు చేశారు. ఈ వీడియో సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ఆగస్టు 13 నుంచి 15 వరకు జరిగే 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'లో భాగంగా ఇంటింటా జాతీయ జెండాను ఎగురవేయాలని (హర్ ఘర్ తిరంగ) ప్రధాని మోదీ ఇటీవలే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 'హర్ ఘర్ తిరంగ' దేశభక్తి గీతాన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన నటులు ప్రభాస్, కీర్తి సురేష్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కనిపించారు. ప్రభాస్ తెలుగులో 'ఇంటింటా జెండా' అంటూ స్వరం కలపారు. అయితే, ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించినట్లు తెలుస్తోంది.

ఈ దేశభక్తి గీతంలో క్రికెటర్​ విరాట్ కోహ్లీ, బాలీవుడ్​ స్టార్​ అమితాబ్ బచ్చన్, క్రీడా దిగ్గజం కపిల్ దేవ్, నేపథ్య గాయని ఆశా భోంస్లే వంటి ప్రముఖ ఉన్నారు. ఆశా భోంస్లే మధురమైన స్వరం దేశభక్తులను మంత్రముగ్దులను చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రముఖ గాయకుడు సోను నిగమ్ కూడా ఆ పాటలో పాలు పంచుకున్నారు.

ఇవీ చదవండి:'ఇంట్లో పూజగది ఉందని గుడికి వెళ్లడం మానేస్తామా?'

commonwealth games 2022: జూడోలో రజతం.. వెయిట్​ లిఫ్టింగ్​, హైజంప్​లో కాంస్యాలు

ABOUT THE AUTHOR

...view details