తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Hanuman teaser: ప్రశాంత్‌ వర్మపై లెజండరీ దర్శకుడు కామెంట్స్​ - ప్రశాంత్ వర్మ పై సింగీతం శ్రీనివాసరావు ప్రశంసలు

యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మపై లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కామెంట్స్​ చేశారు. ఏమన్నారంటే..

Hanuman teaser Director prasanth varma praised by singeetham srinivasarao
Hanuman teaser: ప్రశాంత్‌ వర్మపై లెజండరీ దర్శకుడు కామెంట్స్​

By

Published : Nov 26, 2022, 3:45 PM IST

యువ దర్శకుడు ప్రశాంత్‌ వర్మపై లెజండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రశంసలు కురిపించారు. 'హను-మాన్‌' టీజర్‌ చూసిన ఆయన.. విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయన్నారు. "హనుమాన్‌ టీజర్‌ చూశా. యానిమేషన్‌, విజువల్స్‌, కెమెరా పనితనం అద్భుతంగా ఉన్నాయి. టీజర్‌ ఆరంభంలో భారీ ఆకారంలో హనుమంతుడి విగ్రహాన్ని చూస్తుంటే.. నిజంగానే ఆయన్ని చూస్తున్నామా.. అనిపించేలా ఉంది. భక్తిభావం కలుగుతోంది. ప్రశాంత్‌వర్మకు హ్యాట్సాఫ్‌‌. ఇండియన్‌ సినిమాలో ఈసినిమా ఒక గొప్ప మార్క్‌ సృష్టించనుంది" అని ఆయన అన్నారు. కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ సైతం చిత్రబృందం పనితనాన్ని మెచ్చుకున్నారు. విజువల్స్‌ అత్యద్భుతంగా ఉన్నాయని అన్నారు.

'జాంబి రెడ్డి' తర్వాత యువ నటుడు తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కాంబోలో వస్తోన్న రెండో సినిమా 'హను-మాన్‌'. విభిన్నమైన కాన్సెప్ట్‌తో సూపర్‌హీరో చిత్రంగా ఇది తెరకెక్కింది. ఇటీవల ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా సినీ ప్రియుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. టీజర్‌ చాలా బాగుందని అందరూ మెచ్చుకున్నారు.

ఇదీ చూడండి:హనుమాన్​ మూవీ బడ్జెట్​ అనుకున్నదాని కన్నా ఆరు రెట్లు ఎక్కువగా

ABOUT THE AUTHOR

...view details