Hanuman Premieres :చైల్డ్ ఆర్టిస్ట్‌గా క్రేజ్ సొంతం చేసుకున్న తేజ సజ్జా ప్రస్తుతం హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతూ కెరీర్లో ముందుకెళ్తున్నారు. ఇప్పుడాయన దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి 'హనుమాన్' అనే చిత్రం చేశారు. ఆంజనేయస్వామి బ్యాక్‌డ్రాప్‌లో సూపర్ హీరో కథతో వస్తున్నారు. ఈ సంక్రాంతికి మహేశ్ బాబు 'గుంటూరు కారం', 'వెంకీ సైంధవ్', నాగార్జున 'నా సామి రంగ' లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ 'హనుమాన్' చిత్రం కూడా వెనకడుగు వేయకుండా బరిలోకి దిగింది.
'హనుమాన్' ప్రీమియర్ షోస్ టికెట్స్ - ఊహించని విధంగా మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్! - తేజ సజ్జా ప్రశాంత్ వర్మ
Hanuman Premieres : తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్‌పై మంచి బజ్ నెలకొంది. ఈ సినిమా ప్రీమియర్స్ షోల టికెట్లు కూడా అన్ని అమ్ముడుపోయాయని తెలిసింది. ఆ వివరాలు.
Published : Jan 10, 2024, 12:55 PM IST
అయితే పోటీ ఎక్కువ అవ్వడం వల్ల ఈ సినిమా థియేటర్ల విషయంలో సమస్య నడుస్తోంది. తక్కువ స్క్రీన్లే సినిమాకు దక్కాయి. ఈ క్రమంలో 'హనుమాన్' మూవీ టీమ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలకు ప్లాన్ చేసింది. ఏపీ, తెలంగాణాలో ప్రధాన నగరాల్లో 40 ప్రీమియర్ షోలను ప్లాన్ చేశారు. అయితే అస్సలు ఊహించని విధంగా ఈ చిత్ర ప్రీమియర్ షోల టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం. దీంతో ప్రీమియర్స్‌లో మరిన్ని స్క్రీన్లు పెంచేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బుక్‌మై షోల ఈ సినిమాకు ఆసక్తి చూపించే వారి సంఖ్య భారీగానే ఉంది. ఇప్పుడేమో ప్రీమియర్ షోల టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. దీని ఆధారంగా హను మాన్ సినిమా కోసం ఆడియెన్స్ ఎంత ఆసక్తి చూపిస్తూన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ సినిమా ప్రీమియర్స్‌లో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సంక్రాంతి సినిమాలకు గట్టి పోటీగా నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు బాగానే రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించింది. 2 గంటల 38 నిమిషాలు రన్ టైమ్. యాక్షన్ అంశాలు భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే హనుమాన్ విడుదల అవుతున్న రోజే సూపర్ స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం చిత్రం కూడా విడుదల కానుండడంతో పోటీలో ఎవరు విజయం సాధిస్తారో అన్న ఉత్కంఠ అభిమానుల్లో మరింతగా పెరిగింది.