తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'హనుమాన్' రాంపేజ్​ - ప్రశాంత్ వర్మ ఈ రేంజ్​​ అస్సలు ఉహించలేదయ్యా! - హనుమాన్ బుకింగ్స్​

Hanuman Movie Review : నేడు థియేటర్లలో విడుదలైన హనుమాన్ సినిమా ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ విజువల్ వండర్ టాక్​ను దక్కించుకుంది. ఇప్పుడంతా ఈ సినిమా గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

'హనుమాన్' రాంపేజ్​ - ప్రశాంత్ వర్మ ఇది అస్సలు ఉహించలేదయ్యా!
'హనుమాన్' రాంపేజ్​ - ప్రశాంత్ వర్మ ఇది అస్సలు ఉహించలేదయ్యా!

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2024, 11:20 AM IST

Hanuman Movie Review : థియేటర్ల సమస్యలు, తక్కువ స్క్రీన్స్​, చిన్న హీరో అంటూ ట్రోల్స్​ - ఇలా హనుమాన్​ విడుదలకు ఎన్నో అడ్డంకులు కానీ చివరికీ అవేమీ సినిమా జోరుకు బ్రేకులు వెయ్యలేకపోయాయి. నేడు థియేటర్లో విడుదలైన ఈ సూపర్ హీరో మూవీ బ్లాక్ బస్టర్ టాక్​ను అందుకుంది. జై హనుమాన్ అంటూ థియేటర్లు మార్మోగిపోతున్నాయి. కంటెంట్​లో మ్యాటర్​ ఉంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారన్న మాటను మరోసారి నిరూపించిందీ చిత్రం. ఇప్పుడీ విజువల్ ఫీస్ట్ సినిమాను థియేటర్లలోనే చూసేందుకు సినీ ప్రియులంతా రెడీ అయిపోతున్నారు. ప్రీమియర్ షోస్​ నుంచే అంతలా ఆకట్టుకుంటోందీ చిత్రం.

వాస్తవానికి పేరుకే తెలుగు సినిమానే అయినా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా హైప్​ను క్రియేట్ చేసుకుంది. బడా సినిమాల కన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించేసుకుంది. అ, కల్కి, జాంబిరెడ్డి వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ - ఈ సూపర్‌ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా అద్భుతంగా తీర్చిదిద్దారు.

ముఖ్యంగా తనకిచ్చిన పరిమిత బడ్జెట్‌లోనే చక్కటి గ్రాఫిక్స్‌తో క్వాలిటీ ఫిల్మ్‌ను చూపించారు. పిల్లలు, పెద్దలు మెచ్చేలా సినిమాని చక్కగా ముస్తాబు చేశారు. అందుకే ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ చూసిన అభిమానులు, సినీ ప్రియులు, నటీనటులు సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబిస్తున్నారు. హనుమంతు పాత్రలో సామాన్య కుర్రాడిలా తేజ సజ్జ అదరగొట్టేశారని, ఇక సూపర్‌ పవర్స్‌ వచ్చాక అటు యాక్షన్‌లోనూ ఇటు ఎమోషన్స్​ సన్నివేశాల్లోనూ అతడు తన పాత్ర పరిధి దాటకుండా చక్కటి నటనను కనబరిచారని ప్రశంసిస్తున్నారు. ఎమోషన్స్, డ్రామాతో సినిమా బ్లాక్ బస్టర్ అని చెబుతున్నారు.

Hanuman Movie VFX : వీఎఫ్​ఎక్స్​ గురించి ఎక్కువగా మాట్లాడుతూ - క్లైమాక్స్ 30 నిమిషాలు అద్భుతమని, కొన్ని షాట్స్ అయితే మెంటల్ స్టఫ్‌ అని చెబుతున్నారు. ఈ చిత్రంతో ప్రశాంత్ వర్మకు నార్త్​లో కచ్చితంగా డిమాండ్​ పెరుగుతుందని అంటున్నారు. హనుమాన్ మూవీ ఓ కంప్లీట్ విజువల్ వండర్ అని ట్రెండ్ చేస్తున్న సినీ ప్రియులు - బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్​ను ట్యాగ్ చేస్తున్నారు. హనుమాన్ మూవీని చూసి ఆదిపురుష్ తీయాల్సిందని ట్రోల్స్ కూడా చేస్తున్నారు. తక్కువ బడ్జెట్​తో సూపర్ హిట్ అందించిన ప్రశాంత్ వర్మను చూసి ఓం రౌత్​ నేర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.

రివ్యూ : 'హనుమాన్' విశ్వరూపం - గూస్​బంప్స్​ గ్యారంటీ

రివ్యూ : గుంటూరు కారం - ఆ రెండే హైలైట్స్​ - సినిమా ఘాటుగా ఉన్నట్టేనా?

ABOUT THE AUTHOR

...view details