Hanuman Movie Pre Release Event:టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ లీడ్ రోల్లో తెరకెక్కిన 'హనుమాన్' సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. అయతే విడుదల తేదీ దగ్గరపడుతుండం వల్ల మూవీటీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో హీరో తేజతో కలిసి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ ఈవెంట్‌ను విజయవాడ లేదా తిరుపతిలో జరిపేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది.
అయితే ఆదిపురుష్ ఈవెంట్లాగే ఈ ప్రోగ్రామ్‌లో కూడా భారీ స్టేజ్ సెటప్‌తో పాటు గ్రాండ్ డిజైనింగ్స్ ఏర్పాటు చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే ప్రోగ్రామ్‌కు హైప్ తీసుకొచ్చేందుకు స్టార్ హీరో ప్రభాస్, నట సింహం నందమూరి బాలకృష్ణను గెస్ట్లుగా తీసుకొచ్చేందుకు డైరెక్టర్ ప్రశాంత్ చాలా ప్రయత్నిస్తున్నారట. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో కూడా ప్రశాంత్ వర్మ ఈ విషయాన్ని చెప్పారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిజైనింగ్‌కు ప్రశాంత్ వర్మ హెల్ప్ చేసిన విషయాన్ని కూడా ఈ ఇంటర్వ్యూలో ప్రశాంత్ గుర్తు చేసుకున్నారు. ఇక జనవరి 7న ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.