Hanuman Movie OTT Release : స్టార్ హీరోల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి పాన్ ఇండియా లెవల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన చిత్రం 'హనుమాన్'. టీజర్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుకుంటూ పోయిన ఈ మూవీ ట్రైలర్‌తో వాటిని మరింత రెట్టింపు చేసింది. ఈ పండగ రేసులో చిన్న సినిమాగా నేడు (జనవరి 12న) థియేటర్లలోకి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకరోజు ముందే జనవరి 11న భారీగా ప్రీమియర్ షోలు కూడా పడిపోయాయి. అయితే సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ ఈ విజువల్ వండర్ ఫీస్ట్‌కు ఫిదా అయిపోతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్(Hanuman Review) అంటూ సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు. తక్కువ బడ్జెట్లో అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దినందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Hanuman Ott Rights Price :అయితే ఈ సినిమా ఓటీటీ, శాటిలైట్ పార్టనర్స్ వివరాలు కూడా తెలిశాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 మంచి ధరకే కొనుగులో చేసిందట. ఓటీటీ హిందీ వెర్షన్ రూ. 5కోట్లు, తెలుగు వెర్షన్ రూ. 11 కోట్లకు అమ్ముడుపోయినట్లు కథనాలు వస్తున్నాయి. ఇప్పుడు సినిమాకు హిట్ టాక్ రావడంతో ఓటీటీలోకి వచ్చేందుకు కాస్త ఎక్కువ సమయమే పట్టొచ్చని సమాచారం. మార్చి నెల మధ్యలో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఓటీటీలోకి వచ్చాకే టీవీలో ప్రసారం అవుతుందన్న సంగతి తెలిసిందే.