తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'హనుమాన్‌' అదిరిపోయే VFX హాలీవుడ్​ వాళ్లది కాదు.​. చేసింది మనోళ్లే.. - hanuman movie graphics HaloHues Studios

యువనటుడు తేజ సజ్జ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'హనుమాన్​'. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా గ్రాఫిక్స్ విషయంలో చిత్ర బృందం చాలా శ్రద్ధ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇంతకీ ఈ సినిమా గ్రాఫిక్స్​ ఎవరు చేశారో తెలుసా?

Etv Bharat
Etv Bharat

By

Published : Dec 3, 2022, 7:37 PM IST

టాలీవుడ్​ యువ నటుడు తేజ సజ్జ నటిస్తున్న చిత్రం 'హనుమాన్'​. సూపర్​ హీరో కథాంశంతో పాన్​ ఇండియా రేంజ్​లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. ప్రశాంత్​ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇటీవలే ఈ సినిమా ట్రైలర్​ విడుదలై.. ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్​ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎంతలా అంటే వందల కోట్ల బడ్జెట్​తో పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ హీరోగా రూపొందుతున్న 'ఆదిపురుష్​' సినిమాతో పోల్చేంతగా.

హనుమాన్‌

ఒక విధంగా హనుమాన్​ గ్రాఫిక్స్​ వర్క్​తో.. ఆదిపురుష్​ టీమ్ ఇరకాటంలో పడింది. అయితే హాలీవుడ్​ రేంజ్​​లో ఉన్న ఈ సినిమా వీఎఫ్ఎక్స్ విదేశాల్లో చేసింది కాదు. హైదరాబాద్​కు చెందిన 'హేలో హ్యూస్ స్టూడియోస్(HaloHues Studios)' అనే సంస్థ ఈ సినిమాకు గ్రాఫిక్స్ అద్దింది. దీంతో ఈ కంపెనీ గురించి టాలీవుడ్‌ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

హనుమాన్‌

సూపర్ హీరో కాన్సెప్ట్​తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంజనాద్రి అనే ఒక ఊహాలోకంలో జరిగే సూపర్ హీరో థ్రిల్లర్​గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ABOUT THE AUTHOR

...view details