Hanuman Movie Donation Ayodhya:విజువల్ వండర్స్ 'హనుమాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. గురువారం రాత్రి ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ నుంచి శుక్రవారం కూడా ఫుల్ ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది. దీంతో మూవీటీమ్ హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్లో హీరో తేజ సజ్జ,డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.
ముందుగా స్థానిక హనుమాన్ ఆలయానికి వెళ్లి మూవీటీమ్ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అయితే ప్రతి టికెట్‌పై రూ.5 'అయోధ్య' మందిరానికి విరాళంగా ఇవ్వనున్నట్లు మూవీటీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రకటించింది. దీంతో తొలిరోజు కలెక్షన్ నుంచి రూ.14.25 లక్షలు అయోధ్యకు పంపనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరిట చెక్‌ను కూడా రివీల్ చేశారు.
విరాళం మరింత ఫెయిర్‌గా: అయితే ముందుగా అనుకున్నట్లు అయోధ్య రామ మందిరానికి ఇచ్చే విరాళం ఫెయిర్‌గా ఉంటుందని డైరెక్టర్ ప్రశాంత్ తెలిపారు. 'సినిమా హిట్టైనందున ఒక దశలో మొత్తం డబ్బులు మేం తీసుకొని డొనేట్ చెయ్యరని కొందరు అనుకోవచ్చు. అలా జరగదు. మేము ఈ విషయంలో పారదర్శకంగా ఉన్నాం. టికెట్లు అమ్మకాలకు సంబంధించి లైవ్ వెబ్సైట్ క్రియేట్ చేశాం. ఈ వెబ్సైట్లో టికెట్లు సోల్డ్ అవుతున్నా కొద్ది, అయోధ్య విరాళంలో జమ అయ్యే మొత్తాన్ని మీరు చూడవచ్చు' అని ప్రశాంత్ అన్నారు.