తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సినిమాకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు- అయినా ఆ రోజే వస్తున్నాం'

Hanuman Movie Director Interview : ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్​లో వస్తున్న లేటెస్ట్ మూవీ 'హనుమాన్​'. దాదాపు 11 భాషల్లో భారీ బడ్జెట్​తో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలోకి రానుంది. అయితే తాజాగా తమ సినిమాకు ఎవరో తెలియని వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Hanuman Movie Director Interview
Hanuman Movie Director Interview

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 3:13 PM IST

Updated : Dec 30, 2023, 5:07 PM IST

Hanuman Movie Director Interview :టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'హనుమాన్'. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ మూవీ ముందుగా అనౌన్స్ ​చేసినట్టుగానే 2024 జనవరి 12న 11 భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన సాంగ్స్​, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, మూవీ టీమ్​ కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని సందడి చేస్తోంది. అలా తాజాగా మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అంతే కాకుండ ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

అయితే 'హనుమాన్' సినిమా 2024 సంక్రాంతి బరిలో నిలిచింది. అదే రోజు మహేశ్​-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న 'గంటూరు కారం' సినిమా రావడం వల్ల 'హనుమాన్'ను వాయిదా వేసుకోవాలంటూ ఇప్పటికే పలువురు మూవీ టీమ్​ను సంప్రదించారంటూ ఆయన వెల్లడించారు. అంతే కాకుండా తమ సినిమాకు ఎవరో తెలియని వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, రీసెంట్​గా సెన్సార్ విషయంలోనూ కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారంటూ ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ముందుగా అనుకున్నట్లే 'హనుమాన్' మూవీ సంక్రాంతి పోటీలోనే ఉన్నట్లు ప్రశాంత్ స్పష్టం చేశారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్​కు ప్రభాస్: మరోవైపు సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నందున నేపథ్యంలో మూవీ టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్ ముమ్మరం చేయగా, దీంతో పాటు త్వరలోనే ఓ గ్రాండ్​ ప్రీ రిలీజ్ ఈవెంట్​ను రెడీ చేస్తోందట. అయితే ఈ ఈవెంట్​కు రెబల్​ స్టార్ ప్రభాస్​ను ముఖ్యతిథిగా తీసుకొచ్చేందుకు తనతో పాటు తన మూవీ టీమ్ ప్రయత్నిస్తోందంటూ ప్రశాంత్ చెప్పారు.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట హనుమాన్‌ ఉంటాడు' అంటూ సాగే ఈ ట్రైలర్ కట్​ మూవీ లవర్స్​లో ఆసక్తి, అంచనాలను నింపింది. ఉంది. ఇక ఈ సినిమాలో తేజ సజ్జతో పాటు అమృతా అయ్యర్​, వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

VFX వండర్స్​, BGM థండర్స్- హాలీవుడ్​ లెవెల్లో 'హనుమాన్' ట్రైలర్ ​

'మా అండగా ఆయన ఉన్నారు అందుకే వస్తున్నాం' - 'హనుమాన్' రిలీజ్​ డేట్​పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్లారిటీ!

Last Updated : Dec 30, 2023, 5:07 PM IST

ABOUT THE AUTHOR

...view details