Hanuman Movie Day 3 collection:సూపర్ హీరో సినిమా హనుమాన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రీలీజ్ నుంచే హౌస్‌ఫుల్ షోస్‌తో రన్ అవుతున్న ఈ మూవీ మూడోరోజు కూడా అదే జోరు ప్రదర్శించింది. తొలి రెండు రోజుల కంటే ఆదివారం (జనవరి 14) ఎక్కువ వసూళ్లు సాధించింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా మూడోరోజు రూ.15.50 కోట్ల కలెక్షన్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం రూ.40.15 కోట్లు వసూళ్లు సాధించిందని ఇన్సైట్ టాక్. దీంతో విడుదలైన మూడు రోజుల్లోనే హనుమాన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకుంది.
దేశవ్యాప్తంగా రోజువారి వసూళ్లు
- తొలి రోజు- రూ.12.20 కోట్లు
- రెండో రోజు- రూ.12.45 కోట్లు
- మూడో రోజు- రూ.15.50 కోట్లు
Hanuman Movie Occupancy:ఆదివారం తెలుగులో హనుమాన్ ఆక్యుపెన్సీ 83.69 శాతంగా నమోదైంది. అత్యధికంగా వరంగల్ 95 శాతం, హైదరాబాద్ 92 శాతంలో నమోదైంది. అటు హిందీలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మూడోరోజు హిందీలో 31.90 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
Hanuman Overseas:ఓవర్సీస్లోనూ హనుమాన్ దూసుకుపోతోంది. ఇప్పటికే 2+ మిలియన్ డాలర్లు వసూల్ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ తెలిపింది. ఈ క్రమంలో యూఎస్ఏలో 2+ మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన 13వ తెలుగు హీరోగా తేజ సజ్జ రికార్డు కొట్టారు.
ఎప్పటికీ ధర్మమే గెలుస్తుంది: తమ టీమ్ పట్ల, సినిమా గురించి కొందరు నెగిటివ్‌గా ప్రచారం చేశారని హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అన్నారు. 'కొందరు ఫేక్ ప్రొఫైల్స్‌తో సోషల్ మీడియాలో మాపై నెగిటివ్ క్రియేట్ చేశారు. ఆ డిజిటల్ చెత్తను నిన్నటి భోగి మంటల్లో పడేయడం మర్చిపోయారనుకుంటా. మాపై నమ్మకముంచి మాకు మద్దతుగా నిలబడిన ఆడియెన్స్‌కు థాంక్స్. ధర్మం వైపు నిలబడేవారు ఎల్లప్పుడూ గెలుస్తారు. ఇది మరోసారి రుజువైంది. తనపై వచ్చిన నెగిటివిటీని కిందకు తొక్కుతూ, ఈ సంక్రాంతికి హనుమాన్ అనే గాలిపటం ఆకాశంలో ఎత్తులో ఎగరడానికి సిద్ధంగా ఉంది' అని ప్రశాంత్ ట్వీట్ చేశారు.
'హనుమాన్' కలెక్షన్స్ - రెండో రోజు భారీగా జంప్ - ఏకంగా ఎన్ని కోట్లంటే?
3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్- లాభాల్లోకి హనుమాన్!- 2024లో తొలి బ్లాక్‌బస్టర్