Hanuman Movie Day 1 World Wide Collections : అన్నీ అడ్డంకులు దాటుకుని 'హనుమాన్' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12న తేదీన విడుదలైంది. తెలుగులో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ పాన్ ఇండియా లెవల్లో రిలీజైంది. విడుదలైన అన్ని భాషల్లోనూ అంచనాలను మించి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్‌ను అందుకుంది. హనుమంతుడి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
ఈ సినిమా బడ్జెట్ రూ.30కోట్లలోపే అని అంటున్నారు. తక్కువ బడ్జెటే అయినా అదిరిపోయే రేంజ్లో వీఎఫ్ఎక్స్ ఉందని దర్శకుడు ప్రశాంత్ వర్మపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ సినిమా మొదటి రోజు ఎంత వసూల్ చేసిందో అంచనా వివరాలు బయటకు వస్తున్నాయి.
వివరాళ్లోకి వెళితే - అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం మొదటి రోజు రూ.10కోట్లకు పైగా కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఓవర్సీస్ విషయానికొస్తే యూఎస్ఏలో 800kకు పైగా డాలర్స్(Hanuman USA Collections) వసూలు చేసిందని తెలిసింది. అంటే హాఫ్ మిలియన్ డాలర్ మార్క్‌ను టచ్ చేసినట్లు. ఇప్పుడీ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటం వల్ల స్క్రీన్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి రెండో రోజు వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. యూఎస్‌లోనూ 1 మిలియన్ డాలర్ మార్క్‌ను ఈజీగా టచ్ చేస్తుంది.
అయోధ్యాకు విరాళం : సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయిన కారణంగా హనుమాన్ మూవీటీమ్ విజయోత్సాహంలో ఉంది. అలానే ప్రతి టికెట్‌పై రూ.5 అయోధ్య మందిరానికి విరాళంగా ఇవ్వనున్నట్లు మూవీటీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పునట్టుగానే తొలిరోజు వసూళ్ల నుంచి రూ.14.25 లక్షలు అయోధ్యకు పంపనున్నట్లు మేకర్స్ తెలిపారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ పేరిట చెక్‌ను కూడా చూపించారు.
అయోధ్యకు 'హనుమాన్' విరాళం- ఫస్ట్‌డే కలెక్షన్ల నుంచి భారీ మొత్తం