తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆ కళ్లు చిరంజీవివే!- థియేటర్​లో చూస్తే మీరు థ్రిల్​గా ఫీల్​ అవుతారు'

Hanuman Movie Chiranjeevi : డైరెక్టర్​ ప్రశాంత్ వర్మ- యంగ్ సెన్సేషన్ తేజ సజ్జా కాంబినేషన్​లో రూపొందిన తాజా మూవీ 'హనుమాన్​'. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. అయితే తాజాగా ఈ విషయంపై మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు.

Hanuman Movie Chiranjeevi
Hanuman Movie Chiranjeevi

By ETV Bharat Telugu Team

Published : Dec 30, 2023, 8:48 PM IST

Updated : Dec 31, 2023, 6:23 AM IST

Hanuman Movie Chiranjeevi :టాలీవుడ్ స్టార్ డైరెక్టర్​ ప్రశాంత్ వర్మ- యంగ్ సెన్సేషన్ తేజ సజ్జా కాంబినేషన్​లో తెరకెక్కిన లేెటస్ట్ మూవీ 'హనుమాన్​'. భారీ అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ఇప్పటికే ప్రమోషన్స్​ను వేగవంతం చేసింది. పలు ఇంటర్వ్వూలతో పాటు ఈవెంట్లలో సందడి చేస్తూ కనిపించింది. అయితే డైరెక్టర్ ప్రశాంత్​ వర్మ ఓ ఈవెంట్​కు హాజరయ్యారు. అక్కడ యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమధానాలు చెప్పారు. ఈ క్రమంలో మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.

ఇటీవలే విడుదలైన ట్రైలర్​లోని లాస్ట్​ సీన్​లో హనుమంతుడిని చూపించారు. అయితే ఆయన్ను చూపించేకి ముందు ఆయన కళ్లను చూపిస్తారు. అవి చూసేందుకు అచ్చం మెగాస్టార్ చిరంజీవి కళ్లలా ఉన్నాయని ఫ్యాన్స్​ నెట్టింట ఆ ఫొటోను ట్రెండ్ చేశారు. తాజాగా ఈ విషయంపై ఓ యాంకర్ ప్రశాంత్​ను ప్రశ్న అడిగారు. అయితే దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్​ ప్రస్తుతం అభిమానుల్లో సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.

"ట్రైలర్ మీరు చూసిన కళ్ళు చిరంజీవిదే. అయితే ఈ సినిమాలో హనుమంతుడి పాత్రని ఎలా చూపించాలో అంటూ మేము రెండేళ్ల పాటు చర్చలు జరిపాం. ఇప్పుడు అయితే ఈ విషయంపై ఎటువంటి అప్​డేట్​ ఇవ్వలేను కానీ థియేటర్​లో ఆ పాత్రను చూస్తే మీరు తప్పకుండా థ్రిల్ ఫీల్ అవుతారు" అంటూ ప్రశాంత్​ సస్పెన్స్​లో పెట్టారు.

మొత్తానికి ఈ సినిమాలో చిరంజీవి హనుమంతుడి పాత్రలో కనిపిస్తారా లేదా అన్న విషయాన్ని రిలీజ్​ వరకు సస్పెన్స్​గా ఉంచలనుకున్నారు డైరెక్టర్. కానీ అభిమానులు మాత్రం ఇందులో చిరు ఉంటే బాగున్ను అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే ఇందులో తేజ సజ్జతో పాటు అమృతా అయ్యర్​, వరలక్ష్మీ శరత్, సముద్రఖని కుమార్ లాంటి స్టార్స్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక కోటి అనే పాత్రకు మాస్ మహారాజ రవితేజ తన వాయిస్​ను ఇచ్చారు. దాదాపు 11 భాషల్లో ఈ సినిమా రిలీజ్​ కానుంది.

'మా అండగా ఆయన ఉన్నారు అందుకే వస్తున్నాం' - 'హనుమాన్' రిలీజ్​ డేట్​పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్లారిటీ!

'సినిమాకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు- అయినా ఆ రోజే వస్తున్నాం'

Last Updated : Dec 31, 2023, 6:23 AM IST

ABOUT THE AUTHOR

...view details