Hanuman Movie Box Office Collection : చిన్న సినిమాగా విడుదలైన 'హనుమాన్' మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూ సందడి చేస్తోంది. హౌస్ ఫుల్ బోర్డుల నడుమ మంచి టాక్ అందుకుని మరింత జోరు కనబరుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజై వారం రోజులు అవుతోంది. అయితే ఇది కలెక్షన్స్ పరంగా అనేక రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా ఓవర్‌సీస్‌లో ఓ సరికొత్త రికార్డును నమోదు చేసింది. అమెరికాలో అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు చిత్రాల లిస్ట్‌లో తన స్థానాన్ని దక్కించుకుంది. వారంలో ఈ చిత్రం సూమారు 3.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ అందుకుంది.
అయితే ఇప్పటికే అక్కడి బాక్సాఫీస్ వద్ద మహేశ్ బాబు 'భరత్ అనే నేను మూవీ' సుమారు 3.4 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ సినిమా రికార్డును 'హనుమాన్' వారంలోనే దాటేసింది. మరోవైపు ప్రభాస్ సాహో 3. 23 మిలియన్లు, ఆదిపురుష్ 3.16 మిలియన్ల వసూళ్లను అందుకోగా, వాటిని కూడా వారంలో 'హనుమాన్' బ్రేక్ చేసింది.
ఇక అమెరికాలో అత్యధిక వసూళ్లను అందుకున్న సినిమాల లిస్ట్‌లో 'బాహుబలి 2' మూవీ టాప్ పొజిషన్లో ఉంది. ఈ చిత్రానికి అక్కడ సుమారు 20.75 మిలియన్ డాలర్లు వచ్చాయి. ఆ తర్వాతి స్థానంలో 14 మిలియన్ల డాలర్లతో 'ఆర్ఆర్ఆర్' సెకండ్ పొజిషన్లో ఉంది. ఇటీవలే విడుదలైన 'సలార్' 8.90 మిలియన్ డాలర్లతో మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది.