Hanuman Movie Beat KGF Kanatara :2024లో తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'హనుమాన్' బాక్సాఫీస్ వద్ద బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది. చిన్న సినిమాగా 2024 సంక్రాంతి బరిలో నిలిచి, ప్రేక్షకుల ఆదరణ పొంది పెద్ద విజయం సాధించింది. భారత్‌తోపాటు ఓవర్సీస్లోనూ ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. ఈ క్రమంలో హనుమాన్ పలు రికార్డులను బీట్ చేసింది.
హిందీ డబ్బింగ్ వెర్షన్లో (Hindi Dubbing Version) 'కేజీఎఫ్ పార్ట్ 1', 'కాంతారా', 'పుష్ప ది రైజ్' సినిమాల ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లను హనుమాన్ అధిగమించి రికార్డు కొట్టింది. తొలి వీకెండ్లో ఈ బ్లాక్‌బస్టర్ సినిమాల కన్నా హనుమాన్ అత్యధిక వసూళ్లు సాధించింది. హిందీలో ఈ మూవీ ఓపెనింగ్ డే రూ.2.15 కోట్లు, శనివారం రూ.4.05 కోట్లు, ఆదివారం రూ.6.06 కోట్లు వసూల్ చేసింది. మొత్తంగా మూడు రోజుల్లో రూ.12.26కోట్లను అందుకుంది. మరోవైపు నార్త్‌లో తెలుగు వెర్షన్‌కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. మూడు రోజుల్లో రూ.1.09 కోట్లు కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
గుంటూరు కారం vs హనుమాన్!: ఓవర్సీస్లో హనుమాన్ తాజాగా మహేశ్‌బాబు గుంటూరు కారం సినిమా కలెక్షన్స్‌ను బ్రేక్ చేసినట్లు ఇన్సైడ్ టాక్. ఇప్పటివరకు హనుమాన్ ఓవర్సీస్లో దాదాపు 2.20+ మిలియన్ డాలర్లు వసూల్ చేయగా, గుంటూరు కారం 2.16 డాలర్లు కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇక మరో 10 రోజులు హనుమాన్ ఇదే జోరు ప్రదర్శిస్తే, భరత్ అనే నేను (3.42 మిలియన్ డాలర్లు), రంగస్థలం (3.51 మిలియన్ డాలర్లు), అల వైకుంఠపురంలో(3.61 మిలియన్ డాలర్లు) కూడా క్రాస్ చేసే ఛాన్స్ ఉంది.