Hanuman Movie Balakrishna : సంక్రాంతి సినిమాల్లో 'హనుమాన్' బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల్లో వంద కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. నార్త్‌లోనూ మంచి రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఈ సినిమా జోరు చూస్తుంటే రెండు వందల కోట్ల మార్క్‌ను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ అగ్రనటులు సినిమాను అభినందిస్తున్నారు.
అయితే హనుమాన్ చిత్రాన్ని మంగళవారం(జనవరి 16) బాలకృష్ణ ప్రత్యేకంగా వీక్షించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో బాలయ్య కోసం హనుమాన్ స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ షోకు బాలకృష్ణ, దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జాతో పాటు మరికొంతమంది హాజరయ్యారు.
అయితే సినిమా చూశాక బాలయ్య ఏం అన్నారో వీడియో తీసి మైత్రీ మూవీ మేకర్స్ ట్విటర్లో షేర్ చేసింది. సినిమాలో చాలా కంటెంట్ ఉందని, చాలా బాగుందని బాలయ్య ప్రశంసలు కురిపించారు. ఫొటోగ్రఫీ, వీఎఫ్ఎక్స్, మ్యూజిక్ బాగుంది, ఆర్టిస్టులందరూ బాగా నటించారు, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అంతా చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.