Hanuman Director Prasanth Varma :ఈ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల్లో హనుమాన్ కూడా ఒకటి. ఈ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగులో మొదటి సూపర్ హీరో సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఇలా అన్నీ చిత్రంపై అంచనాలను భారీగానే పెంచాయి. బడ్జెట్ పరంగా చిన్న చిత్రమే అయినప్పటికీ పెద్ద సినిమా రేంజ్ మంచి క్రేజ్ ఏర్పడింది.
అయితే రిలీజ్ డేట్ దగ్గరపడటం వల్ల డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ సువర్ణావకాశం ఇచ్చారు. 'హనుమాన్' కోసం పోస్టర్లు డిజైన్ చేస్తున్న పలువురు నెటిజన్లకు ఆఫర్ ప్రకటించారు. 'హనుమాన్' కోసం ఇప్పటి వరకు మీరు క్రియేట్ చేసిన అద్భుత డిజైన్లను చూసి ఎంతో ఆనందించాను. మీరు షేర్ చేసిన పోస్టర్లలో కొన్ని చూసి ఆశ్చర్యపోయాను. మా సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇకపై మీరు చేసే డిజైన్లను #HanuMania హ్యాష్‌ట్యాగ్ జత చేసి షేర్ చేయండి. బెస్ట్‌గా డిజైన్ చేసిన వారికి నా నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో వర్క్ చేసే అవకాశం ఇస్తాను" అని ప్రశాంత్ వెల్లడించారు.