Hamsa Nandini Breast Cancer : నటి హంసా నందిని రొమ్ము క్యాన్సర్‌ను జయించింది. సుమారు ఏడాదిగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె కీమోథెరపీ చికిత్స తర్వాత విజయవంతంగా కోలుకుంది. పూర్తి ఆరోగ్యంతో తిరిగొచ్చిన హంసా నందిని తాజాగా షూటింగ్‌లోనూ పాల్గొంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేసింది.
"సినిమా సెట్‌లో మళ్లీ అడుగుపెట్టాను. ఇది నాకు పునర్జన్మ లాంటిది. పుట్టినరోజున నా కోస్టార్స్, మూవీ టీమ్‌తో సెలబ్రేట్ చేసుకోబోతున్నా. మీ అందరి ప్రేమ, అభిమానం వల్లే నేను కోలుకోగలిగాను. ఐయామ్ బ్యాక్" అంటూ హంసా నందిని రాసుకొచ్చింది.
'ఐయామ్ బ్యాక్' అంటూ ఇన్‌స్టా పోస్ట్.. రొమ్ము క్యాన్సర్‌ను జయించిన ప్రముఖ నటి
తెలుగు సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న నటి హంసా నందిని.. తనకున్న రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడింది. తాజాగా షూటింగ్‌లో పాల్గొన్న ఫోటోలను పంచుకుంది.
నటి హంసా
షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోను కూడా ఆమె షేర్ చేసింది. దీంతో వెల్‌కమ్ బ్యాక్ అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా నటిగా, హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలలో నటించిన హంసా నందిని 'అత్తారింటికి దారేది', 'మిర్చి' సినిమాలో ఐటెం సాంగ్స్‌లో కనువిందు చేసింది.