తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

జస్టిన్​ బీబర్​కు అరుదైన వ్యాధి.. ఆందోళనలో ఫ్యాన్స్​ - జస్టిన్​ బీబర్​కు రోగం

Justin Beiber disease: హాలీవుడ్​ పాప్​ సింగర్​, గ్రామీ అవార్డు విజేత జస్టిన్​ బీబర్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఓ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. దాంతో ఆయన పాక్షికంగా ముఖ పక్షవాతానికి గురయ్యారు.

Justin Beiber disease
జస్టిన్​ బీబర్​ కు వ్యాధి

By

Published : Jun 11, 2022, 12:13 PM IST

Justin Beiber disease: హాలీవుడ్​ పాప్​ సింగర్​, గ్రామీ అవార్డు విజేత జస్టిన్​ బీబర్​కు ఓ అరుదైన వ్యాధి సోకింది. తాను ముఖ పక్షవాతానికి గురైనట్లు తెలిపాడు. దీనికి సంబంధించి ఓ వీడియో సందేశాన్ని షేర్​ చేశాడు. రామ్​ సే హంట్​ సిండ్రీమ్​తో తాను బాధపడుతున్నట్లు తెలిపాడు. ఈ వ్యాధిలో భాగమే తన ముఖానికి పక్షవాతం వచ్చిందని.. కన్ను కూడా ఆర్పలేనని వివరించాడు. ముఖంలోని కుడి భాగం వైపు నాడి వ్యవస్థ దెబ్బతిన్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచ టూర్​లో ఉన్న అతడు ఈ వ్యాధి కారణంగా తన తదుపరి పర్యటలను కొంత కాలం రద్దు చేసుకున్నట్లు తెలిపాడు. పూర్తిగా కోలుకునేంతవరకు ఎటువంటి సంగీత ప్రదర్శనలు ఇవ్వనని చెప్పాడు. దీంతో అతడు భారత్​కు కూడా రావట్లేదు. కాగా, ఈ రోగం ఓ వైరస్ ద్వారా వ్యాపిస్తుందని తెలిసింది. ఈ విషయం తెలియడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అతడి కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

బీబర్​.. ఇటీవలే ప్రపంచ టూర్​ ప్రారంభించాడు. దాదాపు 30 దేశాల్లో 125కుపైగా ప్రదర్శనలు ఇవ్వాలని అనుకున్నాడు. మే నెలలో మెక్సికోలో ప్రారంభమైందీ పర్యటన. 2017లోనూ బీబీర్​ ముంబయిలోని ఓ మైదానంలో ప్రదర్శన ఇచ్చారు. అంతకుముందు అతడి భార్య హెలీ కూడా ఓ వ్యాధి బారిన పడింది. ఆమెకు మెదడులో రక్తం గడ్డకట్టడం కొంత కాలం పాటు చికిత్స తీసుకుని దాని బారి నుంచి బయటపడింది.

ఇదీ చూడండి: పెళ్లిపై మాట్లాడిన సాయిపల్లవి.. ఏమన్నారంటే?

ABOUT THE AUTHOR

...view details