తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ప్రముఖ కే-పాప్​ సింగర్ హేసూ​ కన్నుమూత.. హోటల్​ గదిలో.. - హేసూ కే పాప్​ సింగర్​ దక్షిణ కొరియా

Haesoo Kpop Singer Died : ప్రముఖ కే-పాప్​ సింగర్​ హేసూ (29) చనిపోయింది. ఓ ఈవెంట్​ కోసం వెళ్లిన ఆమె.. తన హోటల్​ గదిలో విగతజీవిగా పడిఉంది. ఆమె మృతదేహం వద్ద ఓ సూసైడ్​ నోట్​ కూడా లభ్యమైంది. ఆ వివరాలు..

haesoo kpop singer died
haesoo kpop singer died

By

Published : May 15, 2023, 3:59 PM IST

Updated : May 15, 2023, 6:30 PM IST

Haesoo Kpop Singer Died : తన పాటలతో శ్రోతలను అలరించిన ప్రముఖ కొరియన్​ పాప్ (కే-పాప్​)​ సింగర్​ హేసూ (29) మృతిచెందింది. దక్షిణ కొరియా జియోల్లబుక్​-డో ప్రావిన్స్​లోని వాంజుగన్​ కౌంటీలోని తన హోటల్​ గది​లో విగతజీవిగా పడి ఉంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు.. ఆమె మృతదేహం వద్ద ఓ సూసైడ్​ నోట్​ను స్వాధీనం చేసుకున్నారు. మే 20న జరగబోయే​ ఓ ఈవెంట్ కోసం వాంజుగన్​ చేరుకున్న హేసూ.. ఆ తర్వాత చనిపోయింది. హేసూ మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరలో ఆమె కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలియజేశారు.

హేసూ మరణ వార్త తెలియడం వల్ల ఆమె సహచరులు, తోటి గాయకులు, అభిమానులు షాక్​కు గురయ్యారు. సోషల్​ మీడియా వేదికగా పాప్​ సింగర్​ మృత పట్ల సంతాపం తెలుపుతున్నారు. ఆమె సంగీత నైపుణ్యాలను, అద్భుతమైన గాత్రాన్ని, కొరియన్ సంగీతానికి ఆమె చేసిన సేవలను కొనియాడుతున్నారు. మరి కొందరు.. కొరియన్ సెలబ్రెటీలు ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి చర్చిస్తున్నారు.

1993లో జన్మించిన హేసూ అసలు పేరు కిమ్​ సూ యున్ (Kim Soo-hyun). తన గాత్రం, నైపుణ్యాలతో మంచి గుర్తింపు పొందింది. కొరియన్ సంప్రదాయ సంగీతం 'పన్​సోరి'లో.. కొరియా నేషనల్​ యూనివర్సిటీ ఆఫ్​ ఆర్ట్స్​ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. 'మై లైఫ్​, మీ' అనే ఆల్బమ్​తో 2019లో కే పాప్​లోకి అరంగేట్రం చేసింది హేసూ. తన రెండో ఆల్బమ్​ 2021లో రిలీజ్ చేసింది. ఆ తర్వాత గాయో స్టేజ్​, మార్నింగ్​ యార్డ్​, హౌ డు యూ ప్లే, హ్యంగౌట్​ విత్​ యూ, ది ట్రోట్ షో, 2023 లూనార్ న్యూ ఈయర్​ సందర్భంగా కేబీఎస్​ టీవీలో ప్రసారమైన పోగ్రాంలో మెరిసింది.

అయితే, ఈ మధ్య కాలంలో కే పాప్​ సింగర్ల ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. ఒత్తిడిని తట్టుకోలేక చిన్న వయసులోనే బలవన్మరణానికి పాల్పడుతున్నారు. గత నెల 19న ఆస్ట్రో బ్యాండ్​కు చెందిన ప్రముఖ కే-పాప్​ స్టార్​ మూన్​బిన్ (25) చనిపోవడం ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే, కే-పాప్​ స్టార్ కావడానికి చాలా తీవ్రమైన శిక్షణ ఉంటుంది. కొన్నేళ్ల పాటు కుటుంబాలకు దూరం కావాల్సి ఉంటుంది. ఇలా చిన్న వయసులోనే స్టార్లుగా ఎదిగుతారు యువతీ యువకులు. దక్షిణ కొరియాలో పోటీ ఎక్కువగా ఉంటుంది కనుక ఒకటి రెండు ఆల్బమ్స్​ హిట్​ కాకపోతే.. పాప్​ సింగర్​గా రాణించడం కష్టమవుతుంది. దీంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

కే-పాప్​ సింగర్​ హేసూ
Last Updated : May 15, 2023, 6:30 PM IST

ABOUT THE AUTHOR

...view details