నటనలో వైవిధ్యాన్ని చూపించి, అనతికాలంలోనే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు హీరో సత్యదేవ్. ప్రస్తుతం ఆయన 'లవ్‌మాక్‌టైల్'కు రీమేక్‌గా రూపొందిన 'గుర్తుందా శీతాకాలం' చిత్రంలో నటించారు. ఈ మూవీ డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఫ్యాన్స్‌తో కలిసి ట్విటర్ చాట్ చేశారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో కూల్ సమాధానాలు చెప్పారు. ఆ సంగతులు..
'రామ్‌సేతు'లో ఏపీగా మీ నటన నాకెంతో నచ్చింది. మీ తదుపరి చిత్రాలను హిందీలోనూ విడుదల చేయండి? లేదా బాలీవుడ్ చిత్రాల్లో నటించండి?
సత్యదేవ్: మీరు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు సంతోషిస్తున్నా. భవిష్యత్తులో తప్పకుండా మిమ్మల్ని అలరించడానికి మరిన్ని ప్రాజెక్ట్‌లు చేస్తాను.
ఒకవేళ నటుడు కాకపోయి ఉంటే మీరు ఏ రంగాన్ని ఎంచుకునేవారు?
సత్యదేవ్: నువ్వు అడిగే వరకూ ఆలోచించలేదు. దర్శకుడిని అయ్యేవాడినేమో.
ఎన్టీఆర్‌తో కలిసి మీరు నటిస్తే చూడాలని ఉంది?
సత్యదేవ్: గట్టిగా కోరుకోండి. నేను కూడా ఎదురుచూస్తున్నా.
'రామ్‌సేతు' కోసం అక్షయ్‌కుమార్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉంది?
సత్యదేవ్: అక్షయ్ కుమార్ అంటే ప్రేమ. ఆయనతో మరెన్నో చిత్రాల్లో నటించాలని ఉంది. ఈ సినిమా తర్వాత ఆయనకు వీరాభిమాని అయిపోయా.
రీమేక్స్ మీద ప్రేక్షకులు ఆసక్తి కనబర్చడం లేదు కదా. అలాంటప్పుడు 'గుర్తుందా శీతాకాలం'ను థియేటర్‌లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఓటీటీకి ఇవ్వొచ్చుగా
సత్యదేవ్: ఓటీటీకి అడిగారు. కాకపోతే, ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూస్తేనే ఆ ఫీల్ వస్తుందని భావించాం.
చిరంజీవితో కలిసి వర్క్ చేయడం ఎలా ఉంది?
సత్యదేవ్: మేజికల్‌గా అనిపించింది. ఆ రోజుల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటా.
నువ్వు ఏం చేస్తావో తెలియదు.. పవన్-సుజిత్ సినిమాలో మాకు అనిరుధ్ కావాలి?
సత్యదేవ్: నాది కూడా సేమ్ ఫీలింగ్.