తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'గుంటూరు కారం' ఆల్ టైం రికార్డ్ - RRR రేంజ్​లో రిలీజ్​​! - గుంటూరు కారం ప్రీమియర్స్​

Gunturukaaram Premiers Record : మహేశ్‌ బాబు 'గుంటూరు కారం' ఓ సరికొత్త రికార్డ్ సాధించింది. రాజమౌళి 'ఆర్​ఆర్​ఆర్'​తో సమంగా నిలిచింది. ఆ వివరాలు.

'గుంటూరు కారం' ఆల్ టైం రికార్డ్ - RRRతో​ సమంగా
'గుంటూరు కారం' ఆల్ టైం రికార్డ్ - RRRతో​ సమంగా

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 1:33 PM IST

Updated : Jan 6, 2024, 2:36 PM IST

Gunturu kaaram Premiers Record : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ - సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కాంబినేషన్​లో తెరకెక్కిన చిత్రం 'గుంటూరు కారం'. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన లిరికల్‌ సాంగ్స్‌ లక్షల వ్యూస్‌తో సోషల్‌ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా ఓ రికార్డు సృష్టించింది. ప్రీమియర్‌ షో విషయంలో ఈ ఘనతను అందుకుంది.

'గుంటూరు కారం' కోసం జనవరి 11న అమెరికాలో 5,408కు పైగా ప్రీమియర్‌ షోలు ప్రదర్శించనున్నారు. ఒక తెలుగు సినిమాకు ఇన్ని షోలు వేయడం సరికొత్త రికార్డు. ఇకపోతే గతంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రిలీజ్ అయిన చిత్రాల్లో యూఎస్‌లో అత్యధిక ప్రీమియర్ షోలు ప్రదర్శితం అయిన సినిమాగా RRR(5408 షోలు) రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడా రికార్డును మహేశ్ బాబు 'గుంటూరు కారం' అధిగమించింది. దీంతో ఆల్ టైం రికార్డ్ అంటూ ఈ విషయాన్ని చిత్రబృందం తెలిపింది. ఈ విషయం తెలుసుకుంటున్న సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరు కారం సినిమా పక్కాగా విజయం సాధిస్తుందని నిర్మాత మరోసారి ధీమా వ్యక్తం చేశారు. సినిమా అద్భుతంగా వచ్చిందని.. తమన్‌ మ్యూజిక్‌ మరో స్థాయిలో ఉంటుందని వెల్లడించారు.

Gunturu kaaram Pre Release Event :నేడు(జనవరి 6) జరగాల్సిన గుంటూరు కారం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ వాయిదా వేసినట్లు సమాచారం తెలుస్తోంది. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీసు లైన్స్‌లో వేడుక కోసం నిర్మాతలు ఏర్పాట్లు చేశారు. అయితే బందోబస్తు కల్పించడం సాధ్యం కాదని పోలీసులు దీనికి అనుమతి నిరాకరించినట్లు బయట కథనాలు వస్తున్నాయి. ఇకపోతే సినిమాలో మహేశ్​ బాబు సరసన శ్రీలీల, ఖిలాడీ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్స్​గా నటిస్తున్నారు. హారిక అండ్​ హాసిని క్రియేషన్స్​ బ్యానర్​ సినిమాను నిర్మించింది. తమన్ సంగీతం అందించారు.

'గుంటూరు కారం' ఆల్ టైం రికార్డ్ - RRR రేంజ్​లో రిలీజ్​​!

మహేశ్​ను దాటేసిన తేజ సజ్జ - సంక్రాంతి సినిమాల్లో 'హనుమాన్' టాప్‌!

Last Updated : Jan 6, 2024, 2:36 PM IST

ABOUT THE AUTHOR

...view details