తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'గుంటూరు కారం' రూ.200 కోట్ల మార్క్- మహేశ్​బాబు ఆల్​టైమ్ రికార్డ్! - Guntur Kaaram release date

Guntur Karam Worldwide Collection: టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్​బాబు ఆల్​టైమ్ రికార్డు కొట్టారు. ఆయన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం' రిలీజైన తొలి వారంలోనే రూ.212 కోట్ల మార్క్ అందుకుంది.

Guntur Karam Worldwide Collection
Guntur Karam Worldwide Collection

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 9:52 AM IST

Updated : Jan 19, 2024, 11:25 AM IST

Guntur Karam Worldwide Collection:సూపర్​స్టార్ మహేశ్​బాబు 'గుంటూరు కారం' సినిమాతో ఆల్​టైమ్ రికార్డు కొట్టారు. జనవరి 12న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు ప్రదర్శిస్తోంది. ఓపెనింగ్ రోజు రూ.94 కోట్లు, సెకండ్ డే రూ.33 కోట్లు, మూడో రోజు రూ.37 కోట్ల గ్రాస్ సాధించిన ఈ మూవీ తొలి వారంలో రూ.212 మొత్తం కోట్లు వసూల్ చేసినట్లు మూవీటీమ్ అఫీషియల్​గా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఓ రీజినల్ (ప్రాంతీయ భాషలో) ఫిల్మ్ అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా గుంటూరు కారం నిలిచింది. కాగా, మహేశ్ కెరీర్​లో రూ.200+ గ్రాస్ అందుకోవడం ఇది మూడోసారి.

5Th Rs.100+ Share Film For Mahesh Babu:ఇక మహేశ్​బాబు కెరీర్​లో వరుసగా ఐదోసారి రూ.100+ కోట్ల షేర్ సినిమాతో రికార్డు కొట్టారు. ఇదివరకు 'భరత్‌ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' సినిమాల ద్వారా ఆయన ఈ ఫీట్ అందుకున్నారు. దీంతో వరుసగా ఐదుసార్లు ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా నిలిచారు మహేశ్.

మాటల మాంత్రికుడు శ్రీనివాస్ ముచ్చటగా ముడోసారి మహేశ్​తో సినిమా తెరకెక్కించారు. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా మంచి సక్సెస్ సాధించాయి. ఇక తాజా గుంటూరు కారం సినిమాకు కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మహేశ్​బాబు యాక్టింగ్, మేనరిజం, ఫైట్స్​కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. త్వరలోనే మూవీటీమ్ సక్సెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Guntur Kaaram Cast:ఈ సినిమాలో మహేశ్​కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటించగా, మీనాక్షి చౌదరి కీ రోల్ ప్లే చేసింది. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు. కాగా హారికా అండ్ హసిన్ ప్రొడక్షన్ బ్యానర్​పై నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్​ఫ్లిక్స్​ భారీ ధరకు దక్కించుకుందట. మార్చి ఆఖరి వారంలో గుంటూరు కారం ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.

'గుంటూరు కారం'లో మహేశ్​ కాల్చింది బీడీలు కాదంట - మరేంటంటే?

ఇదే నాకు చివరి తెలుగు సినిమా - అందుకే అలా చేశా : మహేశ్ బాబు

Last Updated : Jan 19, 2024, 11:25 AM IST

ABOUT THE AUTHOR

...view details