Guntur Karam Kurchi Madatha Petti Song :మహేశ్ బాబు శ్రీలీల మాస్ మూడ్‌లోకి దిగారు. 'గంటూరు కారం' సినిమాలోని 'కుర్చీ మడతబెట్టే' అనే సాంగ్‌కు ఈ ఇద్దరూ ఇరగదీసే స్టెప్పులేశారు. ఇటీవలే వచ్చిన ప్రోమోకు నెట్టింట విపరీతమైన రెస్పాన్స్ రాగా, తాజాగా విడుదలైన లిరికల్ సాంగ్ ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. తమన్ మ్యూజిక్‌తో రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, శేఖర్ మాస్టర్ ఇలా సాంగ్‌లోని అన్ని స్టెప్స్ బాగున్నాయని ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. ఈ సాంగ్‌ను నెట్టింట తెగ ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగులు క్రియేట్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలకు మంచి రెస్పాన్సే వచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేశ్, శ్రీలీలతో పాటు మీనాక్షీ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు. సీనియర్ స్టార్స్ జగపతిబాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, సునీల్, ప్రకాశ్ రాజ్, రఘబాబు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిన్ క్రియేషన్స్‌పై రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. భారీ బడ్జెట్‌తో పాటు అంచనాల నడుమ ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
మరోవైపు వచ్చే ఏడాది జనవరి 6న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగనుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని 'గుంటూరు కారం' సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ఆడియెన్స్‌ను అలరించేందుకు విడుదల కానుంది.