Guntur Kaaram Trailer:సూపర్‌స్టార్ మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'గుంటూరు కారం' సినిమాకు ఇప్పటికే హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ట్రైలర్‌ను చిత్రబృందంఆదివారం రిలీజ్ చేసింది. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైమెంట్‌తో కూడిన ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. మరి మీరు ట్రైలర్ చూశారా?
ట్రైలర్లో హీరో మాహేశ్బాబు మేనరిజం, డైరెక్టర్ త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి పండగకు తగ్గట్లుగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చిత్రీకరించారు. మహేశ్‌లోని మాస్ యాంగిల్‌ను త్రివిక్రమ్ అద్భుతంగా వాడుకున్నారు. చాలా రోజుల తర్వాత మహేశ్‌బాబు స్ర్కీన్‌పై టైమింగ్‌తో కూడిన కామెడీ, యాక్షన్ సీన్స్‌లో అలకరించనున్నారు. తమన్ మరోసారి BGM అదరగొట్టేశారు. మొత్తానికి ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
గంటూరులో ప్రీ రిలీజ్!అయితే జనవరి 6న జరగాల్సిన 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ పలు కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. అయితే ఫ్యాన్స్ నిరాశ చెందకుండా మరో రోజు ఈ ఈవెంట్ నిర్వహించాలని మూవీటీమ్ నిర్ణయించిదట. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కాకుండా ప్రక్క రాష్ట్రం గుంటూరులో జనవరి 9న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నాట్లు తెలుస్తోంది.