Guntur Kaaram Trailer 24 Hours Record:సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 'గుంటూరు కారం' ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు బద్దలుకొడుతోంది. ఈ పవర్‌ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో నెం. 1లో ఉండడమే కాకుండా, 24 గంటల్లో ఏకంగా 39 మిలియన్ వ్యూస్ సాధించింది. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీలో 24 గంటల్లో అత్యధిక వ్యూవర్షిప్ సాధించిన సినిమాగా 'గుంటూరు కారం' రికార్డు సృష్టించింది. ఇదివరకు ఈ రికార్డు సలార్ పేరిట ఉంది. ఇటీవల రీలీజైన సలార్ ట్రైలర్‌కు 24 గంటల్లో 32.50 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
గంటూరులో ప్రీ రిలీజ్: ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మొదట జనవరి 6న జరగాల్సి ఉండగా, పలు కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ పడకుండా మూవీ మేకర్స్ తాజాగా మరో డేట్ అనౌన్స్ చేశారు. జనవరి 9న గుంటూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండనున్నట్లు పేర్కొన్నారు. 'మనం ఎంతగానో ఎదురుచూస్తున్న గుంటూరు కారం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు (మంగళవారం) గుంటూరులో జరగనుంది' అని మూవీటీమ్ ట్విట్టర్లో రాసుకొచ్చింది.
ఈ సినిమాకు ఇప్పటికే ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది. తాజా ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. సంక్రాంతి పండగకు తగ్గట్లే సినిమా పూర్తిగా అర్బన్ ఏరియాలోనే కాకుండా, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కూడా చిత్రీకరించారు. ఇక సినిమాలో ఏదో పాత సినిమా రిఫరెన్స్ సీన్‌ను గురుజీ యాడ్ చేసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సెకండ్ హీరోయిన్గా నటించిన మీనాక్షీ చౌదరికి కూడా స్క్రీన్ టైమ్ బాగానే ఇచ్చినట్లు తెలుస్తోంది.