Guntur Kaaram Theatrical Rights:సూపర్‌స్టార్ మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'గుంటూరు కారం' రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడవుతున్నాయి. అటు ఓవర్సీస్లోనూ బుకింగ్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా పూర్తయ్యాయి.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ 'గుంటూరు కారం' డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. అటు వరల్డ్‌వైడ్‌గా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ రూ.134.6 కోట్లు జరిగింది. అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.104.1 కోట్ల బిజినెస్ జరిగింది. అత్యధికంగా నైజాం థియేట్రికల్ రైట్స్ రూ.42 కోట్లకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. ఇక ఉత్తరాంధ్ర రూ.14 కోట్లు, సీడెడ్ రూ.13 కోట్లు, తూర్పు గోదావరి రూ. 8.8 కోట్లు, గుంటూరు రూ.7.8 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.6.5 కోట్లు, కృష్ణా రూ.6.5 కోట్లు, నెల్లూరు రూ.4 కోట్లకు సినిమా రైట్స్ అమ్ముడయ్యాయి. మరో రూ.9.5 కోట్ల బిజినెస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగింది. అటు ఓవర్సీస్లో రూ.21 కోట్లకు ఓప్పందం కుదిరింది.
దీంతో ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.134.6 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో గుంటూరు కారం బ్రేక్ ఈవెన్‌కు చేరుకోవాలంటే రూ.135 కోట్ల షేర్ వసూళ్లు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే పెరిగిన బజ్, మహేశ్‌బాబు ఇమేజ్ కారణంగా ఓపెనింగ్ కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండవచ్చని ట్రేడ్ వర్గాల టాక్. ఇక సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే, ఈ టార్గెట్ బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.