Guntur Karam Sreeleela :సూపర్ స్టార్ మహేశ్ బాబు, యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్న కొత్త సినిమా 'గుంటూరు కారం' మరో రోజులో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మూవీ మేనియానే కనిపిస్తోంది. ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఎంతో గ్రాండ్‌గా జరిగింది. గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమానికి మూవీటీమ్‌తో పాటు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.
ఈ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇక ఈ ఈవెంట్లో మహేశ్ తన ఫ్యాన్స్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అవ్వడం అభిమానులను కంటతడి పెట్టించింది. తన సినిమాలకు ఎప్పుడూ రివ్యూ చెప్పే తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ లేకపోవడం, ఇకపై ప్రేక్షకులు, అభిమానులే తనకు అమ్మ నాన్న అంటూ మహేశ్ మాట్లాడటం సూపర్ స్టార్ అభిమానులను ఎమోషనల్‌కు గురి చేసింది.
అయితే ఈ ఈవెంట్లో మహేశ్‌తో పాటు శ్రీలీల కూడా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచింది. స్టేజ్‌పై తన మాటలతో అభిమానులను ఆకట్టుకుంది. ట్రెండీ శారీలో మరింత స్టైలిష్‌గా కనిపించి మెరిసిపోయింది. బ్లాక్ కలర్ గడుల చీరలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అయితే ఈ ముద్దుగుమ్మ కట్టుకున్న చీర కాస్త డిఫరెంట్‌గా స్టైలిష్‌గా కనిపించడంతో ఇప్పుడది ట్రెండింగ్‌గా మారింది. ఆ చీర ధర, ఇతర వివరాల గురించి నెట్టింట వెతకడం మొదలు పెట్టేశారు నెటిజన్లు. ఫైనల్‌గా ఆ చీర ధర విని ఖంగు తింటున్నారు. ఎందుకంటే ఆ చీర ధర లక్షల్లో ఉంది. చూడటానికి ఎంతో సింపుల్‌గా ఉన్న ఈ శారీ ధర రూ. 1.59 లక్షల అని తెలిసి అవాక్కవుతున్నారు. శ్రీలీల కట్టుకోవడం వల్ల ఆ చీరకే అందం వచ్చిందని కూడా ఆమె ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించారు. హారిక్ అండ్ హాసినీ బ్యానర్ సినిమాను నిర్మించింది. నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు.
మహేశ్ గత 5 చిత్రాల వసూళ్లు - 'గుంటూరు కారం' బ్రేక్ చేస్తుందా?