Guntur Kaaram Movie Censor :సూపర్ స్టార్ మహేశ్ బాబు చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ రోల్లో నటించిన సినిమా గుంటూరు కారం. దీంతో ఆయన ఫ్యాన్స్ మహేశ్ మాస్ యాక్షన్‌ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో రచ్చరచ్చ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సినిమా నుంచి వస్తున్న ఒక్కొక్క అప్డేట్తో అంచనాలను ఓరేంజ్‌లో పెంచుకుంటున్నారు. మరోవైపు, ఈ మూవీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఫుల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. సినిమా గురించి ఒక్కొక్క అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు. తాజాగా మూవీకి సెన్సార్ పూర్తయిన విషయాన్ని ట్వీట్‌తో చెప్పారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతీ పోస్టర్, ప్రతీ పాట ప్రేక్షకుల అంచనాలకు మించేలాగానే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్‌ను సంపాదించుకుంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ షేర్ చేశారు. దాంతో పాటు మహేశ్ బాబు రెడ్ షర్ట్ వేసుకొని బీడీ తాగుతున్న మరో ఫొటో కూడా ట్వీట్ చేస్తూ ఆడియన్స్‌ను సిద్ధంగా ఉండమని సిగ్నల్ ఇచ్చారు. "చూడగానే మజా వస్తుంది. హార్ట్ బీట్ పెరుగుతుంది. ఈల వేయాలి అనిపిస్తుంది. బ్లాక్‌బస్టర్ బొమ్మ లోడింగ్. జనవరి 4 డేట్ గుర్తుపెట్టుకోండి" అని నాగవంశీ ట్వీట్ చేశారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు
గుంటూరు కారంలో మహేశ్ బాబుకు జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ఇప్పటికే శ్రీలీలతో రెండు పాటలు విడుదల కాగా మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్‌ను మాత్రం ఇన్నాళ్లకు రివీల్ చేసింది మూవీ టీమ్. మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాటు మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి.