Guntur Kaaram Mahesh Poster : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం 'గుంటూరు కారం' సినిమాలో నటిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన మహేశ్ బాబు, శ్రీలీల పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ఇప్పుడు మరో అప్డేట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
ఆగస్ట్ 9న మహేశ్ బర్త్‌డే సందర్భంగా మూవీ యూనిట్ ఓ మాస్ సర్ప్రైజ్ ఇచ్చింది. బుధవారం అర్ధరాత్రి సరిగ్గా 12:06 నిమిషాలకు గుంటూరు కారం నుంచి మహేశ్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అందులో మహేశ్ లుంగీ కట్టుకుని మాస్ లుక్‌లో కనిపించారు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని.. ఓ చేత్తో స్టైలిష్‌గా చుట్టా కాలుస్తూ కనిపించారు. ఇక ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. రాత్రి నుంచే ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.
ఆ రెండు విషయాలపై ఫుల్ క్లారిటీ..
Guntur Kaaram Release Date : గత కొంత కాలంగా ఈ సినిమా చిత్రీకరణలో పలు మార్పులు జరిగాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ పై అభిమానుల్లో సందిగ్ధత నెలకొంది. అనుకున్నట్లే సంక్రాంతికి ఈ సినిమా వస్తుందా లేదా అంటూ ఫ్యాన్స్ ఆందోళన పడ్డారు. అయితే ఈ అన్ని ప్రశ్నాలను సమాధానిమచ్చేలా ఈ మాస్ పోస్టర్‌ను తయారు చేసింది మూవీ టీమ్.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న 'గుంటూరు కారం' విడుదలకు సిద్ధం కానున్నట్లు అఫీషియల్‌గా చెప్పేసింది. అంతే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంటున్నారంటూ గతంలో వచ్చిన వార్తలను పరోక్షంగానే కొట్టిపారేసింది. పోస్టర్లో ఆయన పేరును ప్రస్తావించి ఆ డౌట్‌ను క్లారిఫై చేసింది. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆయనే కొనసాగనున్నట్లు తెలిపింది.