Guntur Kaaram First Single : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్‌కు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. కన్నడ స్టార్ సింగర్ సంజిత్ హెగ్డే, తమన్ ఈ సాంగ్‌కు తమ గళాన్ని అందిస్తున్నారు. 'దమ్ మసాలా బిర్యానీ..' అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
లీక్‌లను దాటి..
Guntur Kaaram Song Leaked :గతంలో ఈ సాంగ్ లీక్‌కు గురైంది. పాట రిలీజ్‌కు ముందే ఓ ఆడియో క్లిప్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. అందులోనే 'ఎదురొచ్చేగాలి..ఎగరేస్తున్నా చొక్కాపై గుండీ..' బిరియానీ, మసాలా లాంటి మాస్ పదాలు బయటపడ్డాయి. దీంతో మేకర్స్ తాజాగా ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. 'గేమ్ ఛేంజర్' సాంగ్ లీక్ అవ్వగానే తమన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ 'గుంటూరు కారం' విషయంలో దాన్ని ఆపలేకపోయారు.
Guntur Kaaram Movie Cast :'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ తమ బ్యానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్నారు. సీనియర్ నటులైన రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్‌లు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.